మహేష్‌బాబు హీరోగా వచ్చిన 'దూకుడు' సినిమాలో వాడకం అంటే ఇలా వుంటుంది.. అని.. ఓ డైలాగ్ వుంటుంది. ఓ కామెడీ సన్నివేశంలో మహేష్ చెప్తాడు ఆ డైలాగ్. కాని కొన్ని సినిమాల్లో పవన్‌కళ్యాణ్ ఇమేజ్‌ని ఓ రేంజ్‌లో వాడుకోవడం చూసి, 'వాడకం అంటే ఇలాక్కూడా వుంటుందా' అని పవన్ అభిమానులు ముక్కున వేలేసుకోవాల్సి వస్తుంది.
'ఇష్క్' సినిమాతో సక్సెస్‌ట్రాక్ ఎక్కిన నితిన్, తన సినిమా సక్సెస్‌కి కారణం పవన్ ఆశీర్వాదమన్నాడు. ఆ సెంటిమెంట్‌తోనే 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాకి కూడా పవన్ పేరుని, ఆ సినిమాలో పవన్ పాటనీ రీమిక్స్ చేసి వాడుకున్నాడు. నితిన్‌ని చూసి ఐడియా వచ్చినట్టుంది, రవితేజ కూడా తన సినిమాలో పవన్‌కళ్యాణ్ మేనరిజంని వాడుకున్నాడు.
విచిత్రమేమంటే పవన్ పేరునో, పాటనో వాడుకున్న సినిమాలు దాదాపుగా హిట్టవుతున్నాయి. అలా పవన్ హిట్ సెంటిమెంట్ అవుతున్నాడు. ఇదో టైపు పవనిజం.. అని కొందరు చర్చించుకోవడం ఆసక్తికరంగానే వుంది. ఇప్పటికి బాగానే వున్నా, అతి ఎప్పుడూ అనర్ధానికే దారి తీస్తుంది. తన ఇమేజ్ ఈ 'వాడకం' వల్ల డ్యామేజ్ అవుతుందని పవన్ తెలుసుకునే రోజు వచ్చినా రావొచ్చు.
|