Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష - సాహసం

Movie Review - Sahasam

చిత్రం: సాహసం
తారాగణం: గోపీచంద్, తాప్సీ పన్ను, శక్తి కపూర్, ఆలి తదితరులు .....
ఛాయాగ్రహణం: శ్యాం దత్
సంగీతం: శ్రీ
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాణం: BVSN ప్రసాద్ 
దర్శకత్వం: చంద్ర శేఖర్ ఏలేటి
విడుదల తేదీ: 12 జులై  2013

వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న మాస్ హీరో గోపీచంద్ చాలాకాలం గ్యాప్ తీసుకొని 'ఐతే', 'ప్రయాణం' లాంటి విభిన్న చిత్రాలనందించిన డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటితో కలిసి చేసిన అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ ‘సాహసం’ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం కథా కమామిషు ఎలా ఉన్నాయో చూద్దాం.


క్లుప్తంగా చెప్పాలంటే:
ATM  లో సెక్యూరిటీ గార్డ్  గౌతమ్(గోపీచంద్),  చాలా వేగంగా ధనవంతుడు అయిపోవాలని కోరుకుంటూ వుంటాడు.  బాబాలను కలిసి జాతకాలు చూపించుకుంటూ, లాటరీ టికెట్స్ కొంటూ అదృష్టం పరీక్షించుకుంటూ ఉంటాడు. కానీ లాటరీ టికెట్ల ఫలితాలు అతన్ని బాగా నిరుత్సాహపరుస్తుంటాయి. అప్పుడే అతనికి ఓ కొత్త దారి దొరుకుతుంది. గౌతమ్ కి తన తాత గారైన వర్మ(సుమన్) భారత్ – పాకిస్థాన్ విడిపోకముందు పెషవర్ లో వజ్రాల బిజినెస్ చేసేవారు. వర్మ అప్పట్లో తన వారసుల కోసమని, వజ్రాలను ఓ చోట దాచి పెట్టి ఉంచారని గౌతం కి తెలుస్తుంది. ఎలాగైనా వాటిని సంపాదించాలనుకుని, అవి పాకిస్తాన్ లో వున్నాయని తెలుసుకొని పాకిస్తాన్ బయలుదేరతాడు. కానీ అప్పటికే శక్తివంతమైన సుల్తాన్ (శక్తి కపూర్) మరియు అతని అనుచరులు అదే నిధి కోసం వెతుకుతూ ఉంటారు. ఆ తరువాత ఏమి జరుగుతుందో, ఆ నిధిని గౌతమ్ సంపాదిస్తాడో, లేదో వెండి తెరపై చూడండి.

మొత్తంగా చెప్పాలంటే:
విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి ఈ సారి మరో ఆసక్తికరమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మధ్య వచ్చే తెలుగు చిత్రాలతో పోలిస్తే ఈ చిత్రం చాలా విభిన్నంగా పరిగణించవచ్చు. కథనం చాలా నెమ్మదిగా నిలకడగా వుంది. మాటలు ఫర్వాలేదు.   నేపధ్య సంగీతం నిరుత్సాహపరిచేదిగా వుంది. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలం. సందర్భానికి తగ్గట్టుగా కాస్ట్యూమ్స్ బాగా రూపకల్పన చేశారు.

గోపీచంద్ గౌతమ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. అతను చేసిన యాక్షన్ సన్నివేశాలు అదరహో అనిపించేలా వున్నాయి. తాప్సీ చూడటానికి చాలా అందంగా వుంది. అలీ ఖయామత్ రాజుగా నవ్వులు పూయించాడు.  శక్తి కపూర్ టెర్రరిస్ట్ పాత్రలో జీవించాడు. సుమన్  అతని పాత్రకి న్యాయం చేశాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే: అడ్వెంచరస్ మూవీ

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with lyricist anantha sreeram