Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: బెంగాల్‌ టైగర్‌ 
తారాగణం: రవితేజ, తమన్నా, రాశి ఖన్నా, బోమన్‌ ఇరానీ, పృధ్వీ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, రావు రమేష్‌, షయాజీ షిండే, నాగినీడు, ప్రభ, తనికెళ్ళ భరణి తదితరులు. 
చాయాగ్రహణం: సౌందర్‌ రాజన్‌ 
సంగీతం: భీమ్స్‌ 
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్‌ నంది 
నిర్మాత: రాధా మోహన్‌ 
విడుదల తేదీ: 11 డిసెంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
సరదాగా అల్లరి చిల్లరగా తిరిగేసే ఆకాష్‌ నారాయణ్‌ (రవితేజ), ఎలాగైనా ఫేమస్‌ అయిపోదామని, మంత్రి మీద బహిరంగ సభలో రాయి విసురుతాడు. తొలుత కోపమొచ్చినా, ఆకాష్‌ తెగువ నచ్చిన ఆ మంత్రి, అతన్ని తన దగ్గర పనిలో పెట్టుకుంటాడు. ఆకాష్‌ హోంమంత్రిని ఇంప్రెస్‌ చేసి, అతని దగ్గర ఉద్యోగం సంపాదిస్తాడు. హోంమంత్రి కూతురు (రాశి ఖన్నా) ఆకాష్‌ ప్రేమలో పడుతుంది. ఇద్దరికీ పెళ్ళి చేద్దామని హోంమంత్రి అనుకుంటున్న సమయంలోనే ఆకాష్‌, తాను సీఎం అశోక్‌ గజపతి (బోమన్‌ ఇరానీ) కూతురు (తమన్నా)ను ప్రేమిస్తున్నానని షాకిస్తాడు. ఆ తర్వాత ఏమయ్యింది? సామాన్యుడైన ఆకాష్‌, అంత పెద్ద స్థాయికి ఎలా చేరాడు? హోంమంత్రి కూతురు, ముఖ్యమంత్రి కూతురు ఈ ఇద్దరిలో ఎవర్ని ఆకాష్‌ పెళ్ళాడతాడు? అనేవి తెరపై చూడాలి. 

మొత్తంగా చెప్పాలంటే 
మాస్‌ మహరాజ్‌ తనకు అలవాటైన పాత్రలో చెలరేగిపోయాడు. ఎనర్జీకి కేరాఫ్‌ అడ్రస్‌ కావడంతో రవితేజకి ఈ పాత్ర పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. అలా అలా చేసుకుపోయాడంతే. ఎంటర్‌టైనింగ్‌గా, ఎనర్జిటిక్‌గా, పవర్‌ఫుల్‌గా రవితేజ సినిమాకి అంతా తానే అయ్యాడు. పాటల్లోనూ, ఫైట్స్‌లోనూ రెచ్చిపోయాడంతే. 

తమన్నా, రాశి ఖన్నా గ్లామర్‌లో ఒకరితో ఒరు పోటీ పడ్డారు. నటన పరంగా తమన్నాకి మార్కులు పడతాయి. రాశి ఖన్నా బికినీతో ఆకట్టుకుంటే, తమన్నా నడుమందంతో ప్రేక్షకుల్ని కట్టి పడేసింది. బోమన్ ఇరానీ ఆకట్టుకున్నాడు. ఈ మధ్యకాలంలో వెరైటీ కామెడీ పాత్రలతో చెలరేగిపోతున్న కమెడియన్‌ పృధ్వీ ఈ సినిమాలోనూ దుమ్మురేపాడు. అమలా పాల్‌ పాత్రలో బ్రహ్మీ ఆకట్టుకుంటాడు. రావు రమేష్‌, షయాజీ షిండే, తనికెళ్ళ భరణి ఓకే అనిపిస్తారు. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగా చేశారు. 
కథ కొత్తదేమీ కాదు. కమర్షియల్‌ సినిమా కావడంతో లాజిక్కుల గురించి మాట్లాడుకోవడం అనవసరం. అయితే కొంచెం అయినా లాజిక్‌ గురించి దర్శకుడు ఆలోచించి ఉంటే బాగుండేది. డైలాగ్స్‌ బాగున్నాయి. స్క్రీన్‌ప్లే పరంగా వేగం చూపించాడు. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాకి కావాల్సినవన్నీ ఎంచుకుని కూర్చేశాడు దర్శకుడు. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్స్‌ సినిమాకి అవసరమైన విధంగా పనిచేశాయి. బాగా ఖర్చు చేశారు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఎడిటింగ్‌ సెకెండాఫ్‌లో కాస్త అవసరమనిపిస్తుంది. 

ఫస్టాప్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగిపోతుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రొమాన్స్‌ యాక్షన్‌ మిక్స్‌ చేసి దర్శకుడు పెర్‌ఫెక్ట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని ప్లాన్‌ చేశాడు. కొన్ని ట్విస్ట్‌లు, కావాల్సినంత గ్లామర్‌, పవర్‌ఫుల్‌ డైలాగులు, పంచ్‌ డైలాగులు, కడుపుబ్బా నవ్వించే కామెడీతో ఫస్టాఫ్‌ సాగిపోతుంది. సెకెండాఫ్‌లో కూడా ఇవన్నీ ఉన్నా కొంచెం డల్‌ అనిపిస్తుంది. అయినా ఎక్కడా బోర్‌ కొట్టనివ్వలేదు. ఓవరాల్‌గా కమర్షియల్‌ సినిమాల్ని, మాస్‌ సినిమాల్ని మెచ్చే ఆడియన్స్‌ని టార్గెట్‌ చేయడం, సినిమాకి మంచి పబ్లిసిటీ చేయడం కలిసొస్తాయి. కమర్షియల్‌గా సినిమాకి బాగా వర్కవుటయ్యే అవకాశాలెక్కువ. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
బెంగాల్‌ టైగర్‌ మాస్‌ మహరాజ్‌ పవర్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
interview