Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
soggadu  ready to release

ఈ సంచికలో >> సినిమా >>

ఎన్టీఆర్‌ సినిమా.. సో కాస్ట్‌లీ గురూ!

NTR movie  so costly..


ఎన్టీఆర్‌ హీరోగా వస్తున్న సినిమా 'నాన్నకు ప్రేమతో..' ప్రస్తుతం స్పెయిన్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. స్పెయిన్‌లోని కాస్ఠ్‌లీ అండ్‌ రేర్‌ లొకేషన్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే ది కాస్ట్‌లియస్ట్‌ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతోందట. డైరెక్టర్‌ సుకుమార్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ సినిమాను రిచ్‌లుక్‌లో కనిపించేలా తెరకెక్కిస్తున్నారట. ఎన్టీఆర్‌ లుక్‌ దగ్గర్నుంచీ, కాస్ట్యూమ్స్‌ అండ్‌ అదర్స్‌ అంతా రిచ్‌గానే కనిపిస్తుందట. ఈ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ పక్కన లక్కీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్‌ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రానికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, దేవిశ్రీప్రసాద్‌ ఎన్టీఆర్‌తో పాడించిన పాట ఒకటి అద్భుతంగా ఉంటుందట. ఈ నెలాఖరులో ఆడియో విడుదల కానుంది. జనవరి 13న సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లావిష్‌గా ఉండేలా సినిమాని దర్శకుడు అద్భుతంగా రూపొందించారు. సుకుమార్‌ చిత్రాలు టెక్నికల్‌ వండర్స్‌ అనిపించుకుంటాయి. ఈ సినిమా కూడా టెక్నికల్‌గా అద్భుతంగా ఉండటమే కాకుండా, రిచ్‌నెస్‌తో ప్రేక్షకుల్ని అలరిస్తుందట. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. 

మరిన్ని సినిమా కబుర్లు
varma crying