Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
ఆఖ‌రికి... బికినీ వేసినా త‌ప్పేం లేదు! - రాశీఖ‌న్నా

రాశీఖ‌న్నా మ‌రీ అంత బ్యూటీక్వీనేం కాదు.
కానీ ఏ సినిమాకు ఎంత అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయాలో మాత్రం బాగా తెలుసు.
తెలుగు సినిమా క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు అనుగుణంగా అల్లుకుపోవ‌డం తెలుసు.
అవ‌కాశాన్ని అందిపుచ్చుకొని... ఆకాశం వైపు దూసుకుపోవ‌డం తెలుసు.
అందుకే రెండేళ్ల‌లో అర‌డ‌జ‌నుకుపైగా సినిమాలు చేసింది. తెలుగు నాట స్థిర‌ప‌డిపోవాల‌న్న ఉద్దేశంతో హైద‌రాబాద్‌కి మకాం కూడా మార్చేసింది. ఒక‌ట్రెండు విజ‌యాలు ప‌డితే చాలు... ఇక సెటిలైపోతా అని న‌మ్ముతోంది. తాజాగా బెంగాల్ టైగ‌ర్ లో మెరిసింది. ఈ సంద‌ర్భంగా రాశీఖ‌న్నాతో గోతెలుగు జ‌రిపిన ముచ్చ‌ట్లు.

* హాయ్ రాశీ..
- హాయండీ..

* 2015 ఎలా గ‌డిచింది?
- చాలా ఫాస్ట్‌గా. అప్పుడే సంవ‌త్స‌రం పూర్త‌యిపోయిందా అనిపిస్తోంది. గ‌తేడాదిలానే ఈ యేడాదీ బిజీ బిజీగా ఉన్నా.

* శివ‌మ్ సినిమా నిరాశ ప‌రిచిందా?
- అది మ‌న చేతుల్లో లేదు క‌దా?  చేయాల్సిన ప‌నిచేయ‌డ‌మే మ‌న బాధ్య‌త‌.  కానీ.. శివ‌మ్ లో నా పాత్ర‌కు మంచి స్పంద‌నే వ‌చ్చింది. క్లిష్ట‌మైన పాత్ర‌ల్ని పోషించ‌గ‌ల‌న‌న్న న‌మ్మ‌కం క‌లిగింది. ఒక్కో సినిమాతో మెరుగు ప‌ర్చుకొంటూ వెళ్ల‌డం అంటేనే నాకిష్టం.

* ఇష్ట‌ప‌డుతూ చేసిన పాత్ర‌కు స‌రైన స్పంద‌న రాక‌పోతే ఏమ‌నిపిపిస్తుంది?
- బాధేస్తుంది.. కాక‌పోతే స్వీయ సంతృప్తి చాలా అవ‌స‌రం. ఆ పాత్ర చేసినందుకు నేను హ్యాపీగా కాదా అనేది ఆలోచిస్తా.

* బెంగాల్‌టైగ‌ర్‌లో శ్ర‌ద్ధ పాత్ర అలాంటి సంతోషాన్ని ఇచ్చిందా?
- చాలా.. ఎందుకంటే ఇది ర‌వితేజ సినిమా. ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం ఓ మ‌ర్చిపోలేని అనుభూతి. చాలా హుషారైన వ్య‌క్తి ర‌వితేజ‌. అలాంటివాళ్లంటే నాకూ ఇష్టమే. షూటింగ్ అంతా స‌ర‌దా స‌ర‌దాగా సాగిపోయింది.

* త‌మ‌న్నాతో క‌ల‌సి వర్క్ చేశారు క‌దా..
- తనో సూప‌ర్ స్టార్‌. కాక‌పోతే... ఆ అహ‌మే ఎక్క‌డా ఉండ‌దు. మేమిద్ద‌రం బాగా క‌లిసిపోయాం. త‌మ‌న్నా నన్ను త‌న సొంత చెల్లెలా చూసుకొంది.

* ఈ సినిమాలో బికినీ వేశారు... త‌మ‌న్నాకుపోటీగానా?
- అదేం లేదు.. త‌న అందానికి ఎవ్వ‌రూ పోటీ కాదు. అయినా.. నేను వేసింది బికినీ కాదు. అదో హాట్ డ్ర‌స్స్ అంతే.

* భ‌విష్య‌త్తులో బికినీ వేయ‌డానికి రెడీనా?
- నా వ‌ల్ల సినిమాకిఅందం, గ్లామ‌ర్ వ‌స్తాయ‌నుకొంటే... బినికీ వేయ‌డంలో త‌ప్పులేదు. కానీ దానికో ప‌ర్ప‌స్ ఉండాలి అంతే.

* లిప్ లాక్‌లూ..
- ఈ విష‌యంలోనూ అంతే. ఏదో కావాల‌ని ముద్దులు పెట్టుకొంటే కిక్ ఉండ‌దు.

* హైద‌రాబాద్‌లో ఇల్లుకొన్నార‌ని టాక్‌..
- ఇల్లేం కొన‌లేదు. కానీ మా ఫ్యామిలీ మొత్తం ఇక్క‌డికి షిఫ్ట్ అయిపోయాం. ఎందుకంటే ఇక్క‌డి వాతావ‌ర‌ణం నాకు బాగా న‌చ్చింది. పైగా షూటింగ్ అంటే వారానికి నాలుగు రోజులైనా హైద‌రాబాద్ రావాల్సివ‌స్తోంది.

* ఇక్క‌డ మీకు స్నేహితులెవ‌రైనా ఉన్నారా?
- నేను అంద‌రితోనూ ఇట్టే క‌ల‌సిపోతా.  ఏ సినిమా చేసినా... ఇద్ద‌రు ముగ్గురు స్నేహితుల్ని సంపాదించుకొంటా. చెప్పాగా.. నేను ర‌వితేజ‌కు అభిమాని అయిపోయా అని. ఆయ‌న్నీ నా ఫ్రెండ్ అనుకోవ‌చ్చు.

* బాలీవుడ్‌కి వెళ్లే ఆలోచ‌న ఉందా?
- ప్ర‌స్తుతానికి లేదు. తెలుగులో సినిమాలు చేసుకొంటూ... ఇక్క‌డే సెటిలైపోవాల‌ని ఉంది.

* పారితోషికం విష‌యంలో మీ అభిప్రాయం ఏమిటి?
- దాని గురించి సీరియ‌స్ గా ఆలోచించ‌లేదు. పారితోషికం అన్న‌ది ప్ర‌తిభ‌తో ఆధార‌ప‌డి ఉంది. నాటాలెంట్‌ని బ‌ట్టే... అది ఇస్తారు.

* బెంగాల్ టైగ‌ర్‌తో టాప్ లీగ్‌లో చేరిన‌ట్టేనా?
- ఆ లెక్క‌లెప్పుడూ వేసుకోను. ప‌రిశ్ర‌మ‌లో నా స్థానం ఏమిట‌న్న‌ది నాకే తెలీదు. నాకంటే సీరియ‌ర్లు నా ముందున్నారు. వాళ్ల వెనుక ఉండ‌డం కూడా నాకు హ్యాపీనే. అయినా నేను ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది.

* సుప్రిమ్‌లో మీ పాత్ర ఉలా ఉండ‌బోతోంది?
- చాలా త‌మాషా పాత్ర అది. ఇప్ప‌టి వ‌ర‌కూ నేనెప్పుడూ కామెడీ చేయ‌లేదు. ఈ సినిమాలో నాలో ఆ యాంగిల్ చూడొచ్చు.

* కొత్త సినిమాలేమైనా ఒప్పుకొన్నారా?
- నాలుగైదు సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లోనే ఓ కొలిక్కివ‌చ్చే అవ‌కాశం ఉంది.

* ఓకే... ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ.

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka