Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
NTR movie  so costly..

ఈ సంచికలో >> సినిమా >>

ఆమె కోసం ఏడ్చేసిన వర్మ

varma crying


సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకి ఎమోషన్స్‌ ఉండవని అందరూ అనుకుంటారు. కానీ ఆయనకు కూడా ఫీలింగ్స్‌ ఉంటాయని ఆయన చెబితేనేగానీ తెలియలేదు ఎవరికీ. వివాదాల వర్మలో సెంటిమెంట్‌ యాంగిల్‌ కూడా ఉంది. ఇటీవల ఆయన తన ఆటో బయోగ్రఫీ 'గన్స్‌ ఆండ్‌ థైస్‌' పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో, తాను వర్మ వెక్కి వెక్కి ఏడ్చిన సందర్భాన్ని ఈ పుస్తకంలో వర్మ ప్రస్తావించారు. తన డైరెక్షన్‌లో వచ్చిన 'నిశ్శబ్ధ్‌' సినిమా హీరోయిన్‌ జియా ఖాన్‌ సూసైడ్‌ చేసుకుని చనిపోయిన సంగతి తెలిసి ఆయన ఏడుపు ఆపుకోలేకపోయారట.

నిజంగానే వెక్కి వెక్కి ఏడ్చారట. ఈ విషయాన్ని ఆయన తన బయోగ్రఫీలో వివరించారు. మరణించే నాటికి జియా ఖాన్‌ వయసు కేవలం 25 ఏళ్ళు మాత్రమే. ఆమె మరణం నేటికీ మిస్టరీగానే ఉంది. ఈ కేసులో సిబిఐ విచారణ చేపట్టింది. జియా ఖాన్‌ ఆత్మ హత్య చేసుకున్నట్లు ధృవీకరించిన సిబిఐ, ఆత్మహత్య చేసుకునేంతగా ఆమెను మానసికంగా శారీరకంగా హింసకు గురిచేశారని వెల్లడించింది. బాలీవుడ్‌ నటుడు సూరజ్‌ పంచోలీ, జియాఖాన్‌తో సహజీవనం చేశాడు. జియాఖాన్‌ మరణానికి సూరజ్‌ కారణమని సిబిఐ స్పష్టం చేసింది. వర్మకే కాదు, జియాఖాన్‌ మరణం ఎందరికో కంటతడి తెచ్చిపెట్టింది. 

మరిన్ని సినిమా కబుర్లు
will sreenu vaitla  into form