వీకెండ్ కు మిత్రులతో సింగపూర్ వెళ్ళాను. మాలో ఒక మిత్రుడికి తిరుగు ప్రయాణంలో ఇంటికి ఫోన్ చేసి 'యాత్ర' గురించి విశ్లేషించడం అలవాటు. అలవాటు ప్రకారం ఫోన్ చేశాడు. నాకిలా వినిపిస్తున్నాయి. "ఆహ్! అంతా బాగానే జరిగింది. ఆ... ఆ... నీకు బ్యాగ్ తీస్కున్నాను. గాజులు బాలేదు ఏంటీ... ఆ... చాక్లెట్స్ తీస్కున్నా! లేదు భార్గవీ, బంగారం పెద్ద తేడా లేదు ఇక్కడికీ అక్కడికీ. అందుకే తీసుకోలేదు. సరే 'అమ్మ' బాగుందా? ఓసారివ్వు "(కొంచం సేపు తర్వాత)" ఆ... అమ్మా... యా... తినేశాను. ఆ... నా ఆరోగ్యం బాగానేవుంది... నీకెలా వుంది? సరే అమ్మా వుంటాను. రాత్రి కొచ్చేస్తా... సరే!!".... ఫోన్ కట్టయ్యింది.
ఎప్పుడో చిన్నప్పటి సామెత - "తల్లి కడుపు చూస్తుంది... పెళ్ళాం జేబు చూస్తుంది" అని... ఇది అప్పటికీ... ఇప్పటికీ... ఎప్పటికీ అంతేనేమో!!
ఈ విషయంలో భార్యది తప్పులేదనే నా ఉద్దేశ్యం... ఎందుకంటే ఏమన్నా మర్చిపోతే గుర్తుచేస్తారు... తిండి తిన్నారా అని ఈ వయసు (30+వయసు) లో అడగాల్సిన అవసరం ఏముంది? మీరేమంటారు?
|