ఏతావాతావరణం వేసవిలో నిప్పుల కొలిమి.. అటుపిమ్మట వరదల విలయం! విపరీతాల వాతావరణం.. కాలుష్యాల పర్యావరణం!!
సచిత్రహింస క్రైమ్ స్టోరీల్లాంటి కోడలూ అత్త సీరియళ్ళు.. ఎడతెగని సాగతీతలతో ప్రేక్షకుల ఆరళ్ళు! పాతచింతకాయ్ పచ్చడి కథలు ఇంకెన్నాళ్ళు.. తిక్కరేగి తిట్టుకొని పోవాల చూసేవాళ్ళు!!
పాకేకాకి భిన్నత్వంలో ఏకత్వం.. భారతీయాత్మ సహజత్వం! పంజా విసిరే పరదేశీ క్రూరత్వం ఎదురొడ్డి ఒక్కటై నిలిచే ధీరత్వం!!