మేష రాశి
ఈవారం కొన్నివిషయాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. చేపట్టిన పనులలో అత్యుత్సాహం పాటించకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళుట మూలాన ఫలితాలను మరింత పొందుటకు అవకాశం కలదు. బంధువులతో కలిసి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వారం మధ్యలో అధికమైన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. కావున పనిపట్ల శ్రద్ధను చూపుట మేలు చేస్తుంది. ఆర్థికపరమైన పనులలో ఫలితాలు అనుకూలంగానే వచ్చుటకు అవకాశం కలదు. ధనలాభంను పొందుతారు. తలపెట్టిన పనులలో ఆటంకాలు కలుగుటకు అవకాశం ఉంది కావున బాగాఆలోచించి పనులను చేపట్టుట ద్వార మేలు జరుగుతుంది. ఇష్టమైన పనులను పూర్తిచేయాలనే తలంపును కలిగి ఉంటారు. ఉద్యోగంలో మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. తోటివారిని కలుపుకొని వెళ్ళుట చేయండి. తొందరపాటు నిర్ణయాలను మాత్రం తీసుకోకండి. మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. క్రిందిస్థాయి వారి మూలాన లాభంను కలిగి ఉంటారు.
వృషభ రాశి
ఈవారం మీరు ఆశించిన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ప్రయత్నాలలో సానుకూల ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధువులతో, మిత్రులతో కలిసి చేపట్టిన పనులలో లాభంను పొందుటకు అవకాశం కలదు. వారం మధ్యలో ఆలోచనలను కలిగి ఉంటారు. కాకపోతే వాటిని అదుపులో ఉంచుకొని పనుల పైన దృష్టిని పెట్టుట మూలాన వారం చివరలో ఫలితాలను పొందుతారు. స్నేహితులతో నిదానంగా వ్యవహరించుట సూచన. లేకపోతే వారి మూలాన ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులు క్రయ విక్రయముల మూలాన లాభంను పొందుతారు. నూతన ఆలోచనలను కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం ఉంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనుటకు అవకాశం ఉంది. మంచి కార్యక్రమాలను చేపడుతారు. అందరిలోను పేరును కలిగి ఉంటారు. పెద్దలతో పరిచయములు కలుగుటకు అవకాశం కలదు. వారి వలన నూతన విషయాలను తెలుసుకుంటారు.
మిథున రాశి
ఈవారం మీరు మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుతాయి. నూతన ఆలోచనలతో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. అందరిలోను గుర్తింపును కోరుకుంటారు. శుక్రవారం కుటుంబంలో కొంత నిశబ్దవాతావరణం ఉండే అవకాశం కలదు. చివరకు విభేదాలు సర్దుకుంటాయి. శని, ఆది వారాలలో చేపట్టిన ప్రయత్నాలను విజయ వంతంగా పూర్తిచేయుటకు అవకాశం కలదు. సోమవారం బంధువులతో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. ధనం చివరి నిమిషంలో చేతికి అందుతుంది కాకపోతే సరైన ఆలోచనలు చేయుట మూలాన కొంత సమయం వృధాకాకుండా కాపాడుకొనే అవకాశం ఉంది. మీరంటే ఇష్టపడని వారు ఇబ్బందులు పెట్టుటకు ప్రయత్నం చేస్తారు. కాకపోతే వారి పట్ల జాగ్రత్తగా ఉండుట సూచన. ప్రయాణాలలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవ్వరితోను మాట పట్టింపులకు పోకపోవడం మంచిది. ఉద్యోగంలో సమయ పాలన అవసరం.
కర్కాటక రాశి
ఈవారం నిర్ణయాలలో కొంత నిదానం అవసరం. అలాగే పెద్దల అనుభవాలను పరిగణలోకి తీసుకోండి. తప్పక మేలుజరుగుతుంది. సోమ, మంగళ వారాలలో ప్రయత్నాలలో విజయంను పొందుతారు. అనుకున్న పనులను పూర్తిచేయ గలుగుతారు. ధనలాభంను పొందుటకు అవకాశం కలదు. సంతోషాన్ని పొందుతారు. శుక్ర, శని వారాలలో అనారోగ్య సమస్యలు భాదించుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో అశ్రద్ద చేయకండి. తగిన జాగ్రత్తలు పాటించుట మంచిది. సరైన సమయానికి భోజనం చేయుట అశ్రద్ద చేయకపోవుట సూచన. కుటుంబంలో నూతన నిర్ణయాలకు అవకాశం ఇవ్వక పోవడమే మంచిది. అవతలి వారికి కూడా అవకాశం ఇవ్వడం మేలు. పనుల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు. నచ్చని ప్రదేశంలో ఉండవలసి రావచ్చును. వస్త్రలాభంను కలిగి ఉంటారు. విందులలో పాల్గొనే అవకాశం కలదు. మొత్తం మీద అనుకోని విధంగా ఖర్చులను పొందుటకు అవకాశం ఉంది. నియత్రించే ప్రయత్నం చేయుట మేలు.
సింహ రాశి
ఈవారం మీ ఆలోచనా శక్తికి పనిపెట్టుట మూలాన అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో లాభంను పొందుతారు. ధనలాభం ఉంటుంది. శుక్రవారం అందరిలోను చేపట్టిన పనుల వలన పేరును సంపాదించుకుంటారు. శని, ఆదివారాలు మాత్రం ఆరోగ్యం విషయం లో ప్రత్యేక శ్రద్ధను తీసుకోవడం మంచిది. పనిభారంను కలిగి ఉంటారు. భోజనం విషయంలో అశ్రద్ద వద్దు. ప్రయాణాల మూలాన స్వల్పంగా ఇబ్బందులను పొందుటకు అవకాశం ఉంది. అధికారుల మూలాన పనిభారంను కలిగి ఉంటారు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. ఉద్యోగంలో అందరితో కలిసి పనులను చేపట్టుట వలన ఫలితాలు త్వరగా వచ్చుటకు అవకాశం ఉంది. మనోదైర్యంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. వాటిలో ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. వ్యతిరేక వర్గంను ఇబ్బందులు పెట్టుటకు అవకాశం కలదు.
కన్యా రాశి
ఈవారం ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. రాజకీయ వ్యవహరాలలో సమయాన్ని గడుపుటకు అవకాశం కలదు. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకొనుట తప్పక మేలుచేస్తుంది. శుక్రవారం పనులలో ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తారు. వాటిలో విజయంను పొందుటకు అవకాశం కలదు. శని, ఆదివారాలలో అందరిలోను గుర్తింపును కలిగి ఉంటారు. అదేవిధంగా ధనాదయంను కలిగి ఉండే అవకాశం కలదు. సోమ, మంగళ వారాలు మాత్రం పనిభారం పెట్టుకోకపోవడం సూచన. త్వరగా అలసి పోవుటకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త వహించుట ఉత్తమం. సంచారం చేయుట మూలాన కొంత ఇబ్బందిని పొందుటకు ఆస్కారం ఉంది. కుటుంబానికి సమయాన్ని కేటాయించుట వలన తప్పక మేలుజరుగుతుంది. బుధ, గురువారాలు మాత్రం పనులు నిదానంగా సాగుతాయి. వేచిచూసే ధోరణి అవసరం. కోపంను దూరంగా ఉంచుట నిదానంగా ఉండుట సూచన.
తులా రాశి
ఈవారం ఉద్యోగంలో బాగానే ఉంటుంది. చేపట్టిన పనులు ముందుకు వెళ్ళుట మూలాన కొంత సంతోషాన్ని పొందుటకు అవకాశం కలదు. ఉత్సాహంను కలిగి ఉండి పనులలో వేగంను ప్రదర్శిస్తారు. కాకపోతే శుక్రవారం మాత్రం ప్రతికూలమైన వాతావరణం ఉండటానికి ఆస్కారం కలదు. పెద్దల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం చేత శని,ఆది వారలు పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇష్టమైన వ్యక్తులను కలసే అవాకాశం కలదు. వారి నుండి కొత్త విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. కొత్త పనులను చేపట్టే ముందు వాటిపైన సరైన అవగాహన కలిగి ఉన్నచో తప్పక మేలుజరుగుతుంది. సోమ, మంగళ వారాలు చేసిన పనులకు సంబంధించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా బాగానే ఉంటుంది. కాకపోతే ఖర్చును కూడా అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట సూచన. గురువారం కొంత అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. నూతన పనులను చేపట్టుట యందు ఆసక్తిని కలిగి ఉంటారు.
వృశ్చిక రాశి
ఈవారం దాదాపు మీరు ప్రతి పనిలోను సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండుట నిదానంగా వ్యవహరించుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండుట మంచిది. ఎవ్వరికి అప్పులు ఇవ్వకపోవడం అనేది మంచిది. శుక్ర, శని వారాలు ఆలోచనలు కట్టి పెట్టి పనులపైన శ్రద్ధను పెట్టుట మంచిది. అందువలన ఇబ్బందులు తగ్గుటకు ఆస్కారం కలదు. ఆదివారం వీలైనంత వరకు విశ్రాంతిని తీసుకుంటూ ప్రణాళికను సిద్దం చేసుకోవడం చేత సోమ, మంగళ వారాలలో పనులలో కొంత ఫలితాలను సాధించే అవకాశం ఉంది. పెద్దల పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది. నిదానంగా వ్యవహరించుట మేలు. చేపట్టిన పనులలో అధికమైన శ్రమను కలిగి ఉంటారు. ఫలితాలు మీరు ఆశించిన విధంగా ఉండకపోవచ్చును. మీ ఆలోచనలకు అనుభవజ్ఞుల సలహాలను జోడించుట ఉత్తమం. కుటుంబంలో కూడా మనస్పర్థలు కలుగుటకు ఆస్కారం కలదు. కావున అందరిని కలుపుకొని వెళ్ళుట చేత మేలుజరుగుతుంది.
ధనస్సు రాశి
ఈవారం మీరు ఆశించిన ఫలితాలను నిదానంగా నైన పొందుటకు అవకాశం ఉంది. రాజకీయ వ్యవహారాలలో మీ ఆలోచనలు మంచి ఫలితాలను కలగజేస్తాయి. నచ్చిన పనులను శుక్రవారం చేపట్టుటకు అవకాశం కలదు. కాకపోతే శని, ఆదివారాలు మీరు ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవడం చేత కొంత భాదను పొందుటకు ఆస్కారం కలదు. ఒకవార్త మాత్రం మిమ్మల్ని భాధకు గురిచేసే అవకాశం కలదు. కావున మానసికంగా ధృడంగా ఉండుట అవసరం. గురువారం ఆశించిన ఫలితాలు రావడం చేత కొంత వరకు ఊరట చెందుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో మాత్రం దాదాపు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మేలు. అధికారుల వలన ఇబ్బందులు పొందుటకు ఆస్కారం కలదు. కుటుంబంలో చేపట్టిన ఆలోచనల మూలాన మంచి ఫలితాలు పొందుటలో ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కావున జాగ్రత్త వహించుట మేలు. పెద్దల మూలాన మేలుజేరుగుతుంది. గతంలోని పరిచయాలు లాభిస్తాయి.
మకర రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను పొందుతారు. నూతన ఆలోచనలు చేయుటకు ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించట మంచిది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. చేపట్టిన పనులలో అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి ఆర్థికాభివృద్ధిని కలిగి ఉంటారు. శుక్రవారం మాటను పొదుపుగా వాడుట సూచన. లేకపోతే వివాదములు కలుగుటకు ఆస్కారం ఉంది. శని, ఆదివారాలు చేపట్టిన పనులలో విజయాన్ని పొందుతారు. సోమ, మంగళ వారాలు పనిని పక్కన పెట్టి అధికమైన ఆలోచనలు పొందుటకు ఆస్కారం ఉంది. కావున జాగ్రత్త వహించుట మంచిది. గురువారం ఒకవార్త మూలాన కొంత నిరాశను పొందుటకు ఆస్కారం ఉంది. చర్చలలో పాల్గొనుటకు ఆసక్తిని కనబరుస్తారు. విధ్యాసంబంధమైన విషయాల్లో సమయం గడుపుతారు. మిత్రులతో కలిసి ప్రయత్నాలను ముందుకు తీసుకు వెళ్ళు ప్రయత్నాలు ఆరంభిస్తారు. శ్రమను మాత్రం కలిగి ఉంటారు.
కుంభ రాశి
ఈవారం మంచి ఫలితాలను పొందుటకు అవకాశం కలదు కాకపోతే స్వతప్పిదం చేయకపోవడం సూచన. శుక్రవారం సంతోషంగా గడుపుతారు. మీ ఆలోచనలను అందరితోను పంచుకొనే అవకాశం కలదు. శని, ఆది వారాలలో మీ ఆలోచనలను తోటివారు వ్యతిరేకించే అవకాశం ఉంది. ఆ సమయంలో నిదానంగా వ్యవహరించట అవసరం. ప్రణాళికా ప్రకారం వెళితే సోమ, మంగళ వారాలలో తప్పక విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఉద్యోగంలో మీ ఆలోచనలు మంచి ఫలితాలు ఇవ్వడం చేత సంతోషాన్ని పొందుతారు. మిత్రులతో కలిసి చేపట్టిన పనులలో మాత్రం పనిభారం ఉంటుంది. ఆర్థికపరమైన విషయల్లో తప్పక అభివృద్దిని కలిగి ఉంటారు. సంతృప్తిని పొందుటకు అవకాశం ఉంది. ఆరోగ్యంను అశ్రద్ద చేయకండి. సమయానికి భోజనం చేయుట ఉత్తమం. మాత్రుకుటుంబం నుంచి సౌఖ్యంను పొందుటకు ఆస్కారం కలదు. వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు. నూతన పనులలో సమయాన్ని గడుపుతారు.
మీన రాశి
ఈవారం నిదానంగా వ్యవహరించుట సూచన. పెద్దల సూచనలు సలహాలను పాటించుట మూలాన తప్పక మేలుజరుగుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఉండవు బాగెనే ఉంటుంది. కుటుంబంలో బాగుంటుంది. శుక్రవారం అధికమైన ఆలోచనలు కలిగి ఉండుటకు ఆస్కారం ఉంది. ఆలోచనలు తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. శని, ఆదివారాలు కొంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చును. కావున ఈ సమయంలో నూతన పనులు చేపట్టుట మంచిది. సోమ, మంగళ వారాలు కొంత మాటను పొదుపుగా వాడుట వలన మేలు జరుగుతుంది. గతంలో చేపట్టిన పనుల తాలుకు ఫలితాలు బుధ, గురు వారాలలో వచ్చుటకు ఆస్కారం కలదు. మాత్రు సౌఖ్యంను పొందుతారు. అమ్మ తరుపు బంధువులతో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. కొన్ని విషయాల్లో ఫలితాలు అనుకూలంగా రాకపోవడం వలన కొంత మనోవిచారంను పొందుటకు ఆస్కారం ఉంది. బంధువుల, జీవితభాగస్వామి మూలాన శ్రమను పొందుటకు ఆస్కారం ఉంది.
శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిష్యాలయం
|