Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
as soon as ramcharan druva teaser release

ఈ సంచికలో >> సినిమా >>

మిల్కీ బ్యూటీ 'ఐటెం' బంగారం

milky beauty item song remuneration 75 crores

మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గానే కాకుండా ఐటెం సాంగ్స్‌లో కూడా జోరు మీదుంది. ఇంత వరకూ బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమాల్లోనే ఐటెం సాంగ్స్‌లో నటించింది తమ్యూ బ్యూటీ. ఆ సినిమాల్లో తన ఐటెం సాంగ్స్‌ కోసం చాలా ఎక్కువే రెమ్యునరేషన్‌ తీసుకుంది తమన్నా. ఇప్పుడు మళ్లీ అంతే రేంజ్‌లో రెమ్యునరేషన్‌ అందుకోబోతోంది. కర్నాటక మాజీ ముఖ్య మంత్రి కుమార స్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కుతోన్న 'జాగ్వార్‌' సినిమాలో తమన్నా ఐటెం సాంగ్‌ చేస్తోందట.

ఆ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్‌ వసూలు చేస్తోందట మిల్కీబ్యూటీ. సుమారు 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమన్నాకే కోటికి పైగా రెమ్యునరేషన్‌ అందుకుంటోందని సమాచారమ్‌. ఈ సినిమా కోసం పవన్‌ కళ్యాణ్‌ నుంచి కూడా సపోర్ట్‌ అందుకున్నాడు హీరో నిఖిల్‌ కుమార్‌. నిఖిల్‌ కూడా మంచి డాన్సర్‌ అట. చిన్నప్పట్నుంచీ డాన్సంటే ఎంతో ఇష్టం అట నిఖిల్‌కి. సో తమన్నాతో పోటా పోటీగా అదిరిపోయే స్టెప్పులేశాడట ఈ సాంగ్‌లో. తమన్‌ మ్యూజక్‌ డైరెక్షన్‌లో అదిరిపోయే బీట్స్‌తో ఈ ఐటెం సాంగ్‌ కలర్‌ఫుల్‌గా చిత్రీకరణ చేయనున్నారట. ప్రస్తుతం తమన్నా 'బాహుబలి ది కన్‌క్లూజన్‌'లోనూ, అభినేత్రి' సినిమాలోనూ నటిస్తోంది. అతి త్వరలో 'జాగ్వార్‌' సినిమా కోసం ఐటెం సాంగ్‌ చిత్రీకరణలో పాల్గొనబోతోంది. ఇంతకుముందు తమన్నా 'అల్లుడు శీను', 'స్పీడున్నోడు' చిత్రాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసింది. 

మరిన్ని సినిమా కబుర్లు
mega heroin got super chance