మెగా హీరోయిన్ నిహారిక మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించనుందనే గాసిప్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ వార్త నిజమే అయ్యేలా ఉంది. మెగాస్టార్ 150వ సినిమా 'ఖైదీ నెం.150'లో నిహారికకు ఒక పాత్ర ఫిక్స్ అయ్యిందట. ఏదో కనిపించానా లేదా అన్నట్లుగా కాకుండా ఆ పాత్రకు సినిమాలో ఇంపార్టెన్స్ ఉండనుందట. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తొలిసారిగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను రామ్‌చరణ్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.
శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే అన్నయ్య చిరంజీవి ఫైట్లు, డాన్సులు ఇరగదీసేస్తున్నాడు. కొరియోగ్రాఫర్స్ ప్రభుదేవా, లారెన్స్‌ల డైరెక్షన్‌లో ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ జరుగుతోంది. కామెడీ హీరో సునీల్ కోసం కూడా ఈ సినిమాలో ఒక పాత్ర ఉందని సమాచారం. ఒక పాటలో మెగా ఫ్యామిలీ హీరోల్లో చాలామంది స్టెప్పులేయనున్నారట. మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే యోచనలో ఉంది చిత్ర యూనిట్.
|