Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mega heroin got super chance

ఈ సంచికలో >> సినిమా >>

ఆ ఇద్దరికీ ఆమెనే కావాలా?

jyo achyutananda movie ready to release

క్రేజీ డైరెక్టర్‌ అవసరాల శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ 'జ్యో అచ్చుతానంద'. నారా రోహిత్‌, నాగశౌర్య, రెజీనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్‌ కార్యమ్రాలు పూర్తి చేసుకుని ఈ సినిమా ఈ నెల రెండో వారంలో విడుదలకు సిద్ధంగా ఉంది. క్రేజీ లవ్‌ స్టోరీతో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. టీజర్‌ పరంగా ఇది ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ అని తెలుస్తోంది. కానీ ఈ స్టోరీని తెరకెక్కించడంలోనే అసలు విషయం ఉందట. మామూలు లవ్‌ స్టోరీల కన్నా భిన్నంగా ఈ సినిమా ఉండబోతోందట.

ఆధ్యంతం వినోదం పంచుతూనే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకోనుందట. అవసరాల డైరెక్షన్‌లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' సినిమా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌ని కూడా ఆకట్టుకుంది. ఇదే తరహాలో ఈ సినిమా కూడా చాలా ఆహ్లాదంగా ఆనందంగా నవ్వుకునేలా తీర్చి దిద్దాడట అవసరాల. ఈ సినిమాపైనే నారా రోహిత్‌, నాగశౌర్య ఆశలన్నీ. ఈ ఇద్దరు హీరోలకూ ఒకేసారి సక్సెస్‌ కావాలి. చిత్రంగా ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోలకీ ఒకే హీరోయిన్‌ రెజినా కావాలి. ఇదో వెరైటీ సబ్జెక్ట్‌. ఈ సినిమా హిట్‌తో ఈ ఇద్దరు హీరోలకూ దశ తిరగాలని ఆశిస్తున్నారు. సో త్వరలో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ ఇద్దరు యంగ్‌ హీరోలకూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దామా! 

మరిన్ని సినిమా కబుర్లు
venkatesh speed increase