Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

janata garriage  movie review

చిత్రం: జనతా గ్యారేజ్‌ 
తారాగణం: ఎన్టీయార్‌, మోహన్‌లాల్‌, సమంత, నిత్యామీనన్‌, ఉన్ని ముకుందన్‌, సాయికుమార్‌, సురేష్‌, అజయ్‌, బ్రహ్మాజీ, దేవయాని, సితార, కాజల్‌ అగర్వాల్‌ (స్పెషల్‌ సాంగ్‌), విజయ్‌కుమార్‌, ఆశిష్‌ విద్యార్థి తదితరులు. 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
సినిమాటోగ్రఫీ: తిరునావక్కరసు 
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్‌ 
నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై రవిశంకర్‌, మోహన్‌ 
దర్శకత్వం: కొరటాల శివ 
విడుదల తేదీ: 1 సెప్టెంబర్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 

ఇతరుల కష్టాన్ని చూసి చలించిపోయే మనసున్న వ్యక్తి సత్యం (మోహన్‌లాల్‌). జనతా గ్యారేజ్‌ని నడుపుతున్న సత్యం, అక్కడికి కష్టంతో వచ్చేవారి సమస్యల్ని పరిష్కరిస్తుంటాడు. ఈ క్రమంలో అనుచరులతో కలిసి ఎంతదాకా అయినా వెళ్ళడానికి వెనుకాడడు. ఈ క్రమంలోనే తమ్ముడ్ని, మరదల్ని సత్యం కోల్పోవాల్సి వస్తుంది. దాంతో తమ్ముడి కొడుకు ఆనంద్‌ (ఎన్టీయార్‌) చిన్నప్పటినుంచీ ముంబైలో ఉండే అతని మావయ్య దగ్గర పెరిగేలా చేస్తాడు సత్యం. ఆనంద్‌, పెరిగి పెద్దవాడై పర్యావరణ ప్రేమికుడిగా మారతాడు. ఓ ప్రాజెక్ట్‌ పని మీద హైదరాబాద్‌కి ఆనంద్‌ వచ్చినప్పుడు అనుకోకుండా జనతా గ్యారేజ్‌లోకి అడుగు పెడతాడు. అక్కడి నుంచి కథలో అనేక మలుపులు. గ్యారేజ్‌ బాధ్యతల్ని సత్యం నుంచి ఆనంద్‌ స్వీకరిస్తాడా? 'జనతా గ్యారేజ్‌'లో ఆనంద్‌ పాత్ర ఏమిటి? అన్నది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 

నో డౌట్‌, నటుడిగా ఎన్టీయార్‌ని మరో మెట్టు ఎక్కించే చిత్రమే ఇది. సినిమా కోసం ప్రాణం పెట్టేశాడు ఎన్టీఆర్‌. సినిమా సినిమాకీ నటనలో మెచ్యూరిటీ లెవల్స్‌ పెంచుకుంటూ వెళుతున్న ఎన్టీయార్‌, ఈ సినిమాతో ఇంకో మెట్టు ఎక్కాడు. సున్నితమైన భావాల్ని కూడా ఎంతో చక్కగా ప్రెజెంట్‌ చేశాడు. ఈ మధ్యన ఎన్టీయార్‌ చేసిన సినిమాలన్నిటికీ జీవించేశాడు అనే కాంప్లిమెంట్‌ అందుకుంటున్నాడు. ఇందులోనూ అంతే. సినిమా మొత్తాన్నీ తన భుజాల మీద మోసేందుకు ఎన్టీయార్‌ చేసిన ప్రయత్నం అభినందనీయం. 

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ చాలా బాగా చేశాడని కొత్తగా అనుకోలేం. ఎందుకంటే ఆయన సహజ నటుడు. తన పాత్రలో చూపిన నటనతో సినిమాని ఇంకో లెవల్‌కి తీసుకెళ్ళాడు. మోహన్‌లాల్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ సినిమాకి అదనపు బలం. హీరోయిన్లకు మాత్రం సినిమాలో పెద్దగా స్కోప్‌ దక్కలేదు. పాటలకే హీరోయిన్లు సమంత, నిత్యామీనన్‌ పరిమితమయ్యారు. స్పెషల్‌ సాంగ్‌లో కాజల్‌ అగర్వాల్‌ ఇరగదీసేసిందనడం అతిశయోక్తి కాదు. మిగతా పాత్రధారుల్లో దేవయాని బాగా చేసింది. సినిమాలోని మిగతా తారాగణమంతా తమ తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. విలన్‌ పాత్రధారి ఉన్ని ముకుందన్‌ ఓకే. 

కథ మరీ కొత్తదేమీ కాదు, అలాగని పాతదీ కాదు. మంచి మెసేజ్‌ ఇవ్వాలనే ప్రయత్నంలో అక్కడక్కడా స్టార్‌డమ్‌తో స్ట్రగుల్‌ అయినట్లున్నాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే బాగానే ఉంది. ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండేదనిపిస్తుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. సంగీతం ఆకట్టుకుంటుంది. పాటలు వినడానికే కాదు, తెరపై చూడ్డానికీ అందంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఎడిటింగ్‌ అక్కడక్కడా అవసరమనిపిస్తుందంటే, సినిమా కొంచెం సాగతీతకు గురైందనే అనుకోవాలి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి హెల్పయ్యాయి. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ప్రతి ఫ్రేమ్‌ చాలా రిచ్‌గా అనిపిస్తుంది.  చేసే ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించే కొరటాల, ఇందులోనూ కొత్తదనం కోసం ప్రయత్నించాడు. అందుకు ఆయన్ని అభినందించాలి. సొసైటీకి ఏదో మెసేజ్‌ ఇవ్వాలి, తద్వారా సొసైటీకి మేలు చెయ్యాలనే అతని ఆలోచనకు హేట్సాఫ్‌ అనాల్సిందే. అయితే స్టార్‌తో సినిమా చేసేటప్పుడు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌నీ, అలాగే కథనీ బ్యాలన్స్‌ చేసుకోవాలి. ఇంతకు ముందు రెండు సినిమాల్లోనూ అది కొరటాలకు వర్కవుట్‌ అయ్యింది. ఇక్కడ కొంచెం తేడా కొట్టిందేమో అనిపిస్తుంది. ఓవరాల్‌గా సినిమా టార్గెట్‌ ఆడియన్స్‌ని మెప్పిస్తుంది. అయితే సినిమా కొంచెం సాగతీతకు గురైనట్లు ఉండడం కాస్త ఇబ్బందికరమే. పెరిగిన అంచనాల్ని అందుకోవడం ప్రతిసారీ కష్టమే కావొచ్చు. మొత్తంగా చూస్తే కొరటాల అంచనాల్ని అందుకోవడంలో కొంచెం వెనకబడ్డా, పూర్తిగా అయితే నిరాశపరిచెయ్యలేదు. ఎన్టీఆర్‌ పెర్ఫామెన్స్‌, మోహన్‌లాల్‌ అప్పీయరెన్స్‌, కాజల్‌ ఐటమ్‌ సాంగ్‌, ఇవే కాకుండా సినిమాలో కంటెంట్‌ కలిసి ప్రేక్షకుల్ని నిరాశపర్చవు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 

కొన్ని రిపేర్లు ఇంకా మిగిలిపోయాయ్‌ 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5 

మరిన్ని సినిమా కబుర్లు
interview with NTR