వన్నె తరగని అందం ఆమె సొంతం. ‘అందమా అందమా..’ అని ఆమె గురించి ఇప్పటికీ పాడుకోవచ్చు. రీసెంట్‌గా వచ్చిన ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సినిమాలో వయసుకు తగ్గ పాత్రలో కనిపించి, నటనకు వయసు అడ్డంకి కాదని నిరూపించిన శ్రీదేవి, ప్రస్తుత తరం హీరోయిన్లతో పోటీ పడి అందాన్ని రోజురోజుకీ పెంచుకుంటోంది.
ఇదిగో, ఈ ఫొటోనే నిదర్శనం.. శ్రీదేవి ఇప్పుడున్న హీరోయిన్లకు ధీటుగా తన అందంతో సమాధానమిస్తుందనడానికి. శ్రీదేవికి 50 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్మగలమా? అందం అనేది మనసుకు సంబంధించినది, మనసును సంతోషంగా వుంచుకోగలిగితే, అందం తానంతట అదే వస్తుంది.. అని చెప్పే శ్రీదేవి, తన గ్లామర్ రహస్యం.. ఎప్పుడూ సంతోషంగా వుండడమేనని అంటుంది.
మళ్ళీ సినిమాల్లో నటించాలనే నిర్ణయం చాన్నాళ్ళ తర్వాత తీసుకున్న శ్రీదేవి, ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంది. మళ్ళీ శ్రీదేవి సినిమాల్లో నటించేదెప్పుడోగానీ, బాలీవుడ్ ఫంక్షన్లలో గ్లామరస్‌గా కన్పిస్తూ.. శ్రీదేవి గ్లామర్‌కి తిరుగే లేదు.. అన్పించుకుంటోంది.
|