Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
fifty years beauty

ఈ సంచికలో >> సినిమా >>

ఆ జోష్‌ పవన్‌కే సొంతం

power star pawan kalyan josh

పవన్‌కళ్యాణ్‌ని కొందరు చాలామంచి డాన్సర్‌ అంటారు. కానీ, సినిమాల్లో చాలా పరిమితంగానే అతని డాన్స్‌ మూమెంట్స్‌ వుంటాయి. చాలా సినిమాల్లో పవన్‌ పాటలు పాడాడు. పాడుతూనే వున్నాడు. ఎక్కువగా పవన్‌ తన మనసుకు నచ్చే పాటలే పాడతాడు. అది అతని స్టయిల్‌.

‘అత్తారింటికి దారేది’ సినిమాలో ‘కాటం రాయుడా..’ అనే పాట పాడిన పవన్‌, ఆ పాటతో సినిమాపై నెలకొన్న హైప్‌ని పదింతలు చేసేశాడు. సినిమా ఆడియో విడుదల వేడుకలో ‘ఇంకో పాట వుంది.. దాని గురించి చెప్పను’ అని బ్రహ్మానందం అన్నారు గుర్తుందా? అదే ఈ పాట.

పాటను పాడుతూ పవన్‌ ఎంజాయ్‌ చేసిన తీరు అందర్నీ మెస్మరైజ్‌ చేస్తోంది. పాడుతున్న సందర్భంలో పవన్‌ బాడీ లాంగ్వేజ్‌, డాన్సింగ్‌ మూమెంట్స్‌.. సూపర్బ్‌ అనుకున్నారంతా. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించేస్తోంది. పవన్‌ అంటేనే జోష్‌.. అదే పవన్‌ ఫుల్‌ జోష్‌ మీద పాట పాడితే.. పవనిజంతో ఊగిపోయే అభిమానులకి డబుల్‌ జోష్‌.

మరిన్ని సినిమా కబుర్లు
amrutham in moon