మేష రాశి : ఈ వారం మొత్తంమీద బాగుంటుంది తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేయగలుగుతారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేపట్టుట వలన మంచిగుర్తింపును పొందుతారు. వారం చివరలో అనారోగ్యసమస్యలు కలుగుటకు అవకాశం ఉంది. విందులలో పాల్గొంటారు మిత్రులతో సమయాన్ని గడుపే అవకాశం ఉంది. విద్యార్థులకు నిదానంగా ఫలితాలు వస్తాయి కావున ఫలితాలు ఆశించక శ్రమను కలిగిఉండుట విధ్యపైన దృష్టిని సారించుట మంచిది. ఉద్యోగులకు అధికారుల వద్ద గుర్తింపు వస్తుంది పనులను పూర్తిచేస్తారు కాకపోతే సమయపాలన లేకపోతే ఇబ్బందులు తప్పవు. వ్యాపారస్థులకు ధనమునకు సంభందించిన విషయాల్లో లాభం ఉంటుంది పనిభారం తప్పదు. దూరదృస్టి ఉంటె తప్పక అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కళారంగంలోని వారికి మాటకు మంచివిలువ లబిస్తుంది నూతన విషయాలపైన దృష్టిని పెడతారు.
వృషభ రాశి : ఈ వారం మొత్తం మీద మీరు తలపెట్టిన పనులు నలుగురికి ఉపయోగపడేవిగా ఉంటవి. ఆశించిన స్థాయిలో మార్పులు రావడం మూలన సంతోశంను కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు,ఖర్చుల విషయంలో మాత్రం బాగా ఆలోచించి ముందుకు వెళ్ళుట అనేది సూచన. భోజనం విషయంలో ఎటువంటి అశ్రద్ద చేయకండి సమయానికి భోజనం చేయుట మంచిది. కుటుంభంలో తీసుకొనే నిర్ణయాలు నూతన మార్పులకు స్వాగతం పలుకుతాయి. అదేవిధంగా కుటుంభసభ్యుల ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం సూచన. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకోండి మంచిది తొందరపాటు వద్దు నిదానం అవసరం. సేవారంగంలో సమయాన్ని కేటాయిస్తారు పెద్దలను కలిసే అవకాశం కలదు. ప్రయాణాలు వాయిదా వేయుట ఉత్తమం.
మిథున రాశి : ఈ వారం మొత్తంమీద బాగానే ఉంటుంది తలపెట్టిన పనులకు సంభందించిన విషయాల్లో చివరలో పొందుతారు. ఉత్సాహంతో పనులను చేపడుతారు. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. నూతన పరిచయాలు కలుగుటకు ఆస్కారం ఉంది సమయాన్ని సరదాగా గడిపే అవకాశం ఉంది. విద్యార్థులకు బాగుంటుంది ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండి ముందుకు వెళ్ళండి అలాగే పెద్దల సూచనలు పాటించుట చేత లాభం పొందుతారు. ఉద్యోగులకు అధికారుల వలన మేలుజరుగుతుంది తోటివారినుండి సహాయసహకారాలు లభిస్తాయి. ఓపికతో పనులను చేయండి మంచిఫలితాలు కలుగుతాయి. వ్యాపారస్థులకు కొత్త కొత్త ఆలోచనలు ఉండే అవకాశం ఉంది సాధ్యసాధ్యాలు ఒకసారి ఆలోచన చేయుట మంచిది. కళారంగంలోని వారికి బాగుంటుంది నూతన అవకాశాలు లభిస్తాయి.
కర్కాటక రాశి : ఈ వారం మొత్తం మీద మీరు ఆరంభంలో తడబాటు ఉన్న కొంతమేర వాటిని అదిగమిస్తారు. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే అవకాశం ఉంది కావున నిదానంగా వ్యవహరించుట మూలాన మేలుజరుగుతుంది. వారం చివరలో అనవసరమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు పెద్దల సలహాలను పాటించే ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. అనారోగ్యసమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. బంధుమిత్రులను కలుస్తారు వారితో ఆలోచనలు పంచుకుంటారు. అధికారులతో చిన్న చిన్న విషయాల్లో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో తొందరపాటు కూడదు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మంచిది. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం ఉంది వారితో సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది.
సింహ రాశి : ఈవారం మొత్తంమీద పనులకు అధికమైన సమయాన్ని కేటయించే అవకాశం ఉంది. ఆశించిన ఫలితాలు రావడం చేత సంతృప్తిని పొందుతారు. ధనమునకు సంభందించిన విషయాల్లో మెలుగు ఉంటుంది కావున నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చును. పెద్దపెద్ద వాళ్ళతో పరిచయాలు ఉపయోగపడేవిగా ఉంటవి అలాగే వారితో కలిసి సమయాన్ని గడుపుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు మాటలకు సమయాని వ్యర్థం చేసుకొనే అవకాశం ఉంది కావున జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. ఉద్యోగులకు బాగుంటుంది ఆశించిన విధంగా బదిలీల విషయంలో స్పష్టమైన అవగాహన ఎర్పరుచుకుంటారు ఆదిశగా ప్రయత్నం ముమ్మరం చేస్తారు. వ్యాపారస్థులకు పనిఒత్తిడితో పాటు లాభం కూడా ఉంటుంది. కళారంగంలోని వారికి గుర్తింపు కోసం చేసే ప్రయత్నాలు కలిసివస్తాయి అవకాశాలు లభిస్తాయి.
కన్యా రాశి : ఈ వారం మొత్తంమీద జీవితభాగస్వామి తో నూతన ప్రయత్నాలు మొదలుపెట్టుటకు అవకాశం ఉంది వాటికి సమయాన్ని కేటాయించే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయల్లో నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు కొంత సానుకూలత లభిస్తుంది. ప్రయాణాల విషయంలో ఒక నిర్ణయానికి రాకపోవడం మంచిది,వేచిచేసే దొరని మంచిది. వాహనములు నడిపెటప్పుడు తగిన జాగ్రత్తలు చేపట్టుట మంచిది. విద్యార్థులకు పెద్దలతో మీ ఆలోచనలు పంచుకోండి ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకొని ప్రయత్నం చేయుట ద్వార లబ్దిని పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు కాస్తఇబ్బంది కలామనే చెప్పుకోవచ్చును అందరిని కలుపుకొని వెళ్ళండి అలాగే అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. వ్యాపారస్థులకు మాటతీరు చేతుచేస్తుంది కావున నిదానంగా వ్యవహరించుట ఉత్తమం. కళారంగంలోని వారికి మిశ్రమఫలితాలు కలవు ఆలాగే మీకంటూ కొన్ని విషయాల్లో తమదైన ముద్రవేయాలనే తలంప్ను కలిగి ఉంటారు.
తులా రాశి : ఈ వారం మొత్తంమీద ఆరోగ్యం విషయంలో ప్రత్యేకమైన శ్రద్దతీసుకోవాలి అలాగే ఆర్థికపరమైన విషయల్లో ఊహించని విధంగా ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులు వారం చివరలో ఆరంభంలో పెద్దగా ఆశించిన విధంగా ఫలితాలు రాకపోవచ్చును. వహానముల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది వాటిమూలన ఖర్చులు కలుగుతాయి. కుటుంభసభ్యులతో నిదానంగా వ్యవహరించుట సూచన. విద్యార్థులకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవచ్చును. సరైన నిర్ణయాలు తీసుకోండి లేకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చును. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి అధికారులతో కలిసి పనిచేయునపుడు వారిఆలొచనల ప్రకారం ముందుకు వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. వ్యాపారస్థులకు బాగుంటుంది ధనము చివరినిమిషంలో చేతికి అందుటకు అవకాశం ఉంది. కళారంగంలోని వారికి తమఅనుకున్న వారితో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది నిదానం అవసరం.
వృశ్చిక రాశి : ఈ వారం మొత్తం మీద మీరు తలపెట్టిన పనుల్లో అమితమైన ఇస్టంను కలిగి ఉండి ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. పని ఒత్తిడి మాత్రం తప్పక పోవచ్చును ఆచితూచి వ్యవహరించుట మూలాన మరింత అనుకూలమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఒక అశుభవార్తను వినే అవకాశం ఉంది మానసికంగా దృడంగా ఉండే ప్రయత్నం చేయండి. ధనమునకు సంభందించిన విషయాల్లో పెద్దల సూచనలు పరిగణలోకి తీసుకొని నిర్ణయాల చేయుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాల వలన స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్త. వాహనముల విషయంలో జాగ్రత్తగా ఉండుట ఉత్తమం. కొన్ని కొన్ని ఆలోచనలు వివాదములకు దారితీసే అవకాశం ఉంది కావున అనుభవజ్ఞుల సూచనలు పాటించుట చేత మేలుజరుగుతుంది.
ధనస్సు రాశి : ఈ వారం మొత్తంమీద ఇష్టమైన పనులను చేపడుతారు నచ్చిన వారితో సమాలోచనలు చేయుటకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మాత్రం తగినజాగ్రత్తలు చేపట్టుట మంచిది. ప్రయాణాలు తప్పక పోవచును వాటివిషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి మంచిది. పనులకు సంభందించిన విషయాల్లో నిదానం అవసరం. చిన్న చిన్న విషయాల మూలాన ఇబ్బందులు తప్పకపోవచ్చును. భోజనం విషయంలో సంతృప్తి ఉంటుంది,విందులలో పాల్గొంటారు. విద్యార్థులకు శ్రమతప్పక పోవచ్చును ప్రణాళిక అవసరం. సమయపలనతో విద్యలో మంచిఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. ఉద్యోగులకు ఇబ్బందులు తప్పవు అధికారులతో నిదానంగా వ్యవహరించుట సూచన ,పనిభారం తప్పకపోవచ్చును. వ్యాపారస్థులకు ఖర్చులు పెరుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మంచిది. కళారంగంలోని వారికి బాగుంటుంది నూతన అవకాశాలు పొందుతారు వాటిని జాగ్రత్తగా వాడుట వలన మేలు జరుగుతుంది.
మకర రాశి : ఈ వారం మొత్తం మీద మీరు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. సమయాన్ని సరదగా గడుపుటకు అవకాశం ఉంది విందులు,వినోదాలకు కేటాయిస్తారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు కాకపోతే వారం మధ్యలో అనారోగ్య సమస్యలు కలుగుటకు ఆస్కారం కలదు జాగ్రత్త. ఉద్యోగంలో అధికారులతో చర్చలు చేయుటకు అవకాశం కలదు మీ సూచనలు తెలియజేయుటకు అవకాశం ఉంది. కుటుంభంలో అందరితోనూ చర్చించుటకు ప్రయత్నం చేయండి అవతలి వారి సూచనలు పరిగణలోకి తీసుకోండి మంచిది. ప్రయాణాల మూలాన అనుకోని ఖర్చులు కలుగుతాయి వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయండి. మిత్రులతో విభేదాలు కలుగుటకు అవకాశం ఉంది సర్దుబాటు విధానం అన్నివిధాల శ్రేయస్కరం మంచిది కూడా.
కుంభ రాశి : ఈవారం మొత్తంమీద ఇతరుల నుండి వచ్చు సూచనలు పరిగణలోకి తీసుకొనే ప్రయత్నం చేయండి. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం. విందులలో పాల్గొనే అవకాశం ఉంది సమయాన్ని వాటికి ఇచ్చే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరుగుటకు అవకాశం ఉంది. అధికమైన ఆలోచనలు కలిగి కొంత అసహనాన్ని పొందుటకు అవకాశం ఉంది. పనులకు సంబంధించిన విషయాల్లో ఒకింత శ్రద్దఅవసరం. నూతన నిర్ణయాలు తీసుకోకపోవడం సూచన. విద్యార్థులకు పెద్దల సహాకారం అవసరం వారి సూచనలు పాటించే ప్రయత్నం చేయుట మంచిది. ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు మిశ్రమఫలితాలు కలుగుతాయి. అధికారులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అవసరం. చర్చలకు దూరంగా ఉండుట మంచిది దానిమూలాన విభేదాలు తగ్గుటకు అవకాశం ఉంది. వ్యాపారస్థులకు మాములుగా ఉంటుంది నూతన పనులకన్నా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుట ఉత్తమం. కళారంగంలోని వారు ప్రయాణాలు చేయుట వలన అలసిపోయే అవకాశం ఉంది. పెద్దలను కలుస్తారు.
మీన రాశి : ఈ వారం మొత్తంమీద మిశ్రమఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన పనుల విషయంలో తొందరపాటు వద్దు ప్రణాళికా ప్రకారం ముందుకు వెల్లుటవలన వాటిని విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. కుటుంభసభ్యులతో కలిసి విందులు,వినోదాలలో పాల్గొనే అవకాశం ఉంది. ధనమునకు సంభందించిన విషయాల్లో నూతన అవకాశాలు పొందుటకు ఆస్కారం ఉంది. పనులలో శ్రమను పొందుటకు అవకాశం ఉంది. విద్యార్థులకు నిరాశాజనమైన ఫలితాలు వచ్చుటకు అవకాశం ఉంది. అధికమైన శ్రద్ధను కలిగిఉండుట మేలుచేస్తుంది. ఉద్యోగులకు అకారణంగా వివాదములు కలుగుటకు అవకాశం ఉంది కావున మాటను అదుపులో ఉంచుకొనుట సాధ్యమైనంత వరకు నిదానంగా వ్యవహరించుట సూచన. వ్యాపారస్థులకు బాగుంటుంది పెట్టుబడుల విషయంలో నిదానంగా వ్యవహరించుట వలన మేలుజరుగుతుంది సమయం కేటాయించుట ఉత్తమం. కళారంగంలోని వారికి బాగుంటుంది నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి.
|