1 . ఏంట్రా తీసుకోగా తీసుకోగా ఆ పనికిమాలిన వాడిదగ్గర అప్పెందుకు తీసుకున్నావ్ ఆ వంద ఎప్పుడిస్తార్ అని వెంట పడుతున్నాడు ?
నేనెక్కడ తీసుకున్నాను అప్పుడెప్పుడో ఒక రెండొందలు నన్ను అప్పు అడిగాడు ప్రస్తుతానికి నా దగ్గర ఒక వందే ఉందని ఇచ్చాను. ఆ రెండో వంద కోసం వెంటపడుతున్నాడు అంతే అన్నాడు
2. ఒక పెద్ద మనిషి ఒక షాపుకు వెళ్లి “ బాబూ బియ్యం ఉన్నాయా ?” అని అడిగాడు.
“లేవండి “ అంటూ సమాధానం ఇచ్చాడు షాపువాడు.
“పోనీ కందిపప్పు ?”
“అది కూడా లేదండి .”
“ చింత పండో ?”
“ పోనీ సబ్బులు ఉన్నాయా ?”
“ లేవండి “ అంటూ సమాధానం వచ్చింది.
“ఆఖరుగా అడుగుతున్నాను. తాళం కప్పలు ఉన్నాయా ?”
“ అవైతే చాలా ఉన్నాయండి” అన్నాడు షాపు వాడు.
“మరింకేం శుభ్రంగా షాపుకు తాళం వేసి ఇంటికి పో “ అన్నాడు కోపంగా ఆ పెద్ద మనిషి.
3 . ఏమిటి ప్రెస్ లో పెద్ద శభ్ధం?” అడిగాడు ఒకడు
“ఏమీ లేదు . బాపూగారి జోక్ ప్రింట్ చేస్తూంటే పేలింది. అంతే.” అన్నాడు రెండవ వ్యక్తి.
4, ఈ రైలు కట్టమీద ఏం చేస్తున్నావ్?” అడిగాడు అక్కడ పడుకున్న ఒకతన్ని అటువైపు వెళ్తున్న ఒక వ్యక్తి.
“ జీవితం మీద విరక్తి పుట్టింది అందుకే ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటున్నాను “ అన్నాడా వ్యక్తి.
“ మరి చేతిలో ఆ మూటేమిటి ?” అడిగాడు అనుమానం వచ్చి అవతలి వ్యక్తి.
“ ఈ వెధవ రైళ్ళు సమయానికి వస్తాయా చస్తాయా అని భోజనం తెచ్చుకున్నాను “ అన్నాడు పట్టాల మీద పడుకున్న వ్యక్తి .
5 . ఒక పత్రికలో ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయినట్టుగా వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి పత్రికకు కోపంగా ” నేను బ్రతికే ఉన్నాను మీరు వ్రాసినది వెంటనే సవరించండి” అన్నాడు.
తర్వాత రోజు పత్రికలో ప్రకటన ఇలా వచ్చింది “ నిన్న పొరపాటుగా మరణించినట్టు ప్రకటించిన రామబ్రహ్మం గారు అనే వ్యక్తి మరణించలేదని తెలుపుటకు విచారిస్తున్నాం “ అని.
6 . “ మీ బార్ షాపు పొద్దున్నే ఎన్నింటికి తెరుస్తారు ?” అడిగాడు ఒక వ్యక్తి.
“ ఉదయం పది గంటలకు “ అన్నాడు షాపు వ్యక్తి.
“ ఒకసారి వచ్చి ఇప్పుడు తెరవడానికి వీలవుతుందా ? “ అడిగాడా వ్యక్తి.
“ఏమిటయ్యా నీ గోల ఇప్పుడు అర్ధరాత్రి పన్నెండయ్యింది. ఇప్పుడెలా వచ్చి తెరుస్తారనుకున్నావ్ ? అయినా ఉదయం వరకు తాగకుండా ఉండలేవా? అయినా ఇప్పుడు నువ్వెక్కడ ఉన్నావ్?” అడిగాడు విసుగ్గా ఆ షాపు వ్యక్తి.
“ ఇంకెక్కడా మీ షాపులోనే ఉన్నాను. నన్ను చూసుకోకుండా తాళం వేసి పోయారు “ అన్నాడా వ్యక్తి.
7 . బాబూ మీ నాన్నగారు ఉన్నారా?” అడిగాడు ఒకాయన ఒక చిన్న కుర్రాడిని.
“ జపాన్ కెళ్ళారు “ అన్నాడు ఆ కుర్రాడు.
“అదేమిటోయ్ పొద్దున్నే కదా కనపడ్డాడు అప్పుడే జపాన్ కెలా వెళ్ళాడు ?” ఆన్నాడు ఆయన.
“ జపాన్ కు కాదండి. జపం చేసుకోవడానికి గుళ్ళోకి వెళ్ళాడు “ అంటూ సమాధానం చెప్పాడు ఆ కుర్రాడు.
8. “ఈ ఊళ్ళో నీకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నట్టున్నారే కనపడిన ప్రతి వాళ్లకు విష్ చేస్తున్నావ్ ?అన్నాడు మిత్రుడు
“ నేనెక్కడ చేస్తున్నాను నేను బఠానీలు నోట్లో వేసుకుంటున్నాను అంతే “ అని జవాబిచ్చాడు అతను.
9. బాబూ ఇక్కడ దగ్గరగా పోలీస్ స్టేషన్ ఏమైనా ఉందా ?” అడిగాడు ఒక వ్యక్తి దారిలో కనపడిన ఇంకొక వ్యక్తిని.
“ పోలీస్ స్టేషనా ఇంకేమేనానా ? ఇటు పది కిలోమీటర్లు , అటు పది కిలోమీటర్లు అరిచి చచ్చినా పలికే వాడు లేడు “ ఆన్నాడా బాటసారి.
“ థాంక్యు .నాక్కావాల్సింది అదే . నీ జేబులో డబ్బంతా బయటకు తియ్యి మర్యాదగా ?” అంటూ పిస్టల్ చూపించాడు ఆ వ్యక్తి.
10. ఒక ముష్టివాడు తన కూతురితో అంటున్నాడు. “ నేను చూసిన సంబంధం ఎందుకు వద్దంటున్నావ్ ఆ అబ్బాయికి కన్నొంకర లేదా కాలోంకర లేదా?” అని.
కన్నవి /విన్నవి : జీడిగుంట నరసింహ మూర్తి
|