Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
weekly horoscope 30thseptember to 3rd october

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎడారుల్లో కల్పవృక్షం- ఖర్జూరం - .

edarullo kalpavruksham karjooram

ఖర్జూరాన్ని ఆంగ్లం లో డేట్ పాం  అంటారు.ఇది  ఎడారి ప్రాంతాల్లో పెరిగే వృక్షం. కొమ్మలు లేనిచెటు, తలపైన గుట్టగా గొడుగులా ఆకులు ఉంటాయి, తాటి,ఈత చెట్లలాంటిది.పామే  కుటుంబానికి చెందినది.  ఎత్తుగా ఆకాశం లోకి పెరిగే ఈ చెట్లు సుమారు 10 నుంచి 20 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. తాటిచెట్ల మాదిరిగానే ఆడా మగా వేర్వేరుగా ఉంటాయి. ఆడచెట్లు మాత్రమే ఫలాల్నిస్తాయి.  5-8 ఏళ్లకు  ఖర్జూర చెట్టు కాపుకొస్తుంది. ఒకప్పుడు ఇది అక్టోబరు - డిసెంబరు సమయంలో మాత్రమే దొరికేది.  ఖర్జూరం  ఫలములు గణికుండు కొనితెచ్చి

-ఖర్జూర ఫలములు గణికుండు కొని
తెచ్చి సగ పాలు మోహంబు సతిని నిచ్చె,
నందు నాల్గవ పాలు నలుగ దమ్మునికిచ్చె,
అష్ట భాగ మిచ్చె అతని సతికీ  ---

అనే గణిత సమస్య పద్య రూపంలో పూర్వం పిల్లలకు ఇచ్చేవారు . ఇలా ఖర్జూరం గణిత సమస్యల్లోనూ చోటు చేసుకుంది.    
ప్రస్తుతం అన్నికాలాల్లోనూలభ్యమవడం జరుగుతున్నది. మనిషికి లభించిన తొలి ఆహారవృక్షంఇది. ఉత్తర ఆఫ్రికా లేదా ఆగ్నేయాసియా ఎడారుల్లోని ఒయాసిస్సు ప్రాంతాల్లో ఇవి పెరుగుతుందేవి. అందువల్ల వీటి జనం స్థలి అదే అని చెప్పవచ్చు.పర్షియన్‌ గల్ఫ్‌లో పుట్టిన ఈ చెట్టును క్రీ.పూ. సుమేరియన్లు మొదట పెంచారనీ తరువాత బాబిలోనియన్లూ  ఈజిప్టియన్లూ మరింతగా పెంచివాడుకలోకి తెచ్చినట్లు భావించవచ్చు. ఆతర్వాత అరబ్బుల ద్వారా ఉత్తర ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కీ అక్కడ నుంచి కాలిఫోర్నియాకీ ఇది  విస్తరించి నట్లు తెలు స్తోంది.  అందుకే యూదులు, ముస్లింలు, క్రైస్తవులు ఈ చెట్టును ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తారు.శాంతికీ, న్యాయానికీ, రవాణాకీ సంకేతంగా ఖర్జూరాన్ని సుమేరియన్లు భావించేవారట. ఈ చెట్టును కేవలం పండ్ల కోసమే కాక నీడకోసం పశువుల మేతకోసం కలపకోసం ఆయుధాలు, తాళ్లకోసం సుమేరియన్లు పెంచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలు స్తోంది.

పూర్వం ఇరాక్  దేశం లో మాత్రమే  ఖర్జూరం  అత్యధికంగా పండేది.. ప్రపంచవ్యాప్తంగా 80 శాతం ఖర్జూరాల్ని ఆదేశమే పండించింది.అందుకే అక్కడి నాణేలు, స్టాంపులు చివరకి బిల్లులమీద కూడా ఖర్జూరపు చెట్ల బొమ్మలు కనిపిస్తాయి. సౌదీ అరేబియా, మొరాకోల్లో కూడా దీన్ని ముఖ్యమైన సంప్రదాయ పంటగానే సాగుచేస్తున్నారు. ఉత్తర ఆఫ్రికా దేశాలైన లిబియా, టునీషియా, అల్జీరియా దేశాలు సైతం ఈ పంటను పండిస్తూ ఆయా దేశాల స్టాంపులు, కరెన్సీ నోట్లమీద ఈ చెట్టు బొమ్మను ముద్రిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఏటా 11 లక్షల టన్నుల ఖర్జూరాల్ని ఈజిప్టు ఉత్పత్తి చేస్తున్నది. సహారా వాసులకు ఇంచుమించు పూర్తిగా తమ ఆదాయం ఈ పంట నుంచే లభిస్తున్నది.
ఖర్జూర పండ్లలోని తేమను బట్టి ఖర్జూరాల్ని మూడు రకాలుగా చెప్పవచ్చు.అవి మెత్తనివి,కొంచెం ఎండినట్లుగా ఉండేవి, పూర్తిగా ఎండినవి . మొదటి రకంలో తేమ ఎక్కువా తీపి తక్కువా . రెండో రకంలో తేమ తక్కువా తీపి ఎక్కువా . మూడో రకంలో తేమ అతి తక్కువగా ఉండి తీపి చాలా ఎక్కువగా ఉంటుంది.. ఇక రంగు రుచి ఆధారం గా ఖర్జూరాలు ఎన్నో రకాలు. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఇవి పండుతున్నా కొలరాడో నదీ తీరాన ఉన్న బార్డ్‌ వ్యాలీలోని పామ్‌ స్ప్రింగ్స్‌లో పండే మెడ్‌జూల్‌ రకానికి మరేవీ సాటిరావని ప్రతీతి. ముదురురంగులో నున్నగా ఉండే ఈ ఖర్జూరాల్నే 'కింగ్‌ ఆఫ్‌ డేట్స్‌' అని కూడా అంటారు. తరువాత స్థానం గుండ్రంగా ఉండే బార్హీది. ఇది మృదువుగా తియ్యగా ఉంటుంది. దీన్ని 'హనీ బాల్‌' అని కూడా అంటారు. ఎక్కువ కాలం నిల్వ ఉండే 'డెగ్లట్‌ నూర్‌', పుడ్డింగ్‌లా కనిపించే 'ఖాద్రావి', అచ్చం తేనెలా ఉండే 'హనీ', నలుపు రంగులో నోట్లో పెట్టుకుంటే కరిగి పోయేలా ఉండే 'బ్లాక్‌ డేట్‌', పొడవుగా కాస్త జేగురు రంగులో  ఉండే 'గోల్డెన్‌ ప్రిన్సెస్‌'... ఇలా ఖర్జూరాల్లో ఎన్నెన్నో రకాలు ఉన్నాయి.  తెలుగు పర్యాయపదాల్లో మధుక్షీరము అనేపేరుంది. అంటే పాలతో కలిసిన కమ్మని తీపి రుచికలిగినదని చెప్పుకోవచ్చు.

ఇతర పండ్లు ఏవైనా  పండుగానే తింటాము, కానీ ఖర్జూరపండు ఎండినా రుచే. నట్‌గా మారిన ఎండు ఖర్జూరం లోని నీళ్లన్నీ ఆవిరైపోవడంతో అది మరింత తియ్యగా ఉంటుంది. మెత్తని పండ్లకోసం అయితే ఇవి రంగు మారి దోరరంగులోకి రాగానే చెట్టు నుంచి కోస్తారు. అదే ఎండుఖర్జూరాల కోసం అయితే చెట్టునే బాగా ఎండనిచ్చి తెంచు తారు. కోశాక వాటి ని కొంతకాలం తేమ వాతావరణంలో ఉంచి కాస్త మెత్తబడేలా చేస్తారు. వేసవిలో పసిపిల్లలకు ఎండుఖర్జూరపు నీళ్లు ఇస్తే వేసవి బధిచదని ఆనీరు పడతారు. పండని పళ్లను కిమ్రి అని, పెద్దవిగా పెరిగి కరకర లాడే ఖర్జూరాలను ఖలాల్‌ అని, పక్వానికొచ్చి మెత్తబడినవాటిని రుతాబ్‌ అని, ఎండు ఖర్జూరాలను తరమ్‌ అని పిలుస్తారు. ఈ అరబిక్‌ పేర్లే ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్నాయి. ఖర్జూరం విత్తనానికి 2 వేల ఏళ్ల తర్వాత కూడా మొలకెత్తే సామర్థ్యం ఉంటుంది.

సంప్రదాయఫలంగానూ నీరాజనాలందుకునేది ఖర్జూరమే. రంజాన్‌ మాసం వచ్చిందంటే ముల్సింస్ , పరిపుష్టి         కరమైన ఆ పండుతోనే ఉపవాసదీక్ష కొనసాగిస్తారు.  అందుకే వారు రంజాన్ కోస్మ ఖర్జూరాలను నిలువ చేసు కుంటారు.ఖోరాన్  ఇలాఉంది,మహమ్మద్‌ ప్రవక్తకు ఖర్జూరం ఎంతో ఇష్టమైన ఫలమట. ఆయన ఇంటిని నిర్మిం చిందికూడా ఖర్జూర కలపతోనే అని చెబుతారు. అంతేగాక, ముస్లింల ప్రథమ మసీదు మదీనా లోని ప్రవక్త గారి మసీదు నిర్మాణం ఖర్జూరపు చెట్టు కలప తోనూ ,పై కప్పులకు ఖర్జూరపు చెట్టు ఆకులతోనూ చేసినట్లు కూడా చెప్తారు. అందుకే ఇస్లామిక్‌ దేశాల్లో ఖర్జూర వృక్షాన్ని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

ఖర్జూరపు  పండ్లేకాక దాని ఇతర భాగాలన్నీకూడా చాలాఉపయోగకరమైనవే!  లేత ఆకుల్ని కూరగా వండుకుంటారు.ఓమారు ప్రయత్నిద్దామా?
ఉత్తర ఆఫ్రికాలో ఆకుల్ని మన ఆంధ్రాప్రాంత గ్రామాల్లో ఈత తాటి ఆకుల్లా గా పూరికప్పులు వేసుకోను ఉపయోగిస్తారు.ఇలా ఖర్జూరం పేదలు గుడిసెలుకట్టుకోను రక్షణ నిస్తున్నదనన్మాట. తాటి ఆకుల మాదిరిగానే చాపలు, తడికెలు, బుట్టలు, విసనకర్రలు నేస్తారు.  ఎండుటాకులు చీపుళ్లుగానూ వంటచెరకుగానూ ముఖ్యంగా పేదలు వాడుకుంటారు. ఆకుల్లోని పీచుతో తాళ్లు, టోపీలు, నేతబట్టలు లాంటివీ అల్లుతారు.
కరవు సమయాల్లో వీటి విత్తనాల్ని పొడి చేసి గోధుమపిండిలో కలిపి రొట్టె చేసుకుని తింటారు.నానబెట్టి పొడి కొట్టి న విత్తనాలను పశువుల మేతగా వాడుతారు.

సబ్బులు, సౌందర్య సాధనాల తయారీలో విత్తనాల నుంచి తీసిన నూనె ఉపయోగిస్తారు. ఈ విత్తనాలో దొరికే  ఆక్జాలిక్‌ ఆమ్లాం జాగ్రత్తపరుస్తారు.
ఖర్జూర ఫలాలే కాదు, పుష్పాలూ రుచికరమైనవే. అందుకే ఆయా దేశాల మార్కెట్లలో వీటిని ప్రత్యేకంగా అమ్ము తారు. ఖర్జూరం వైద్యంలోకూడా ఉపయోగిస్తుంది.పెద్దపేగు లోని  సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్‌ మంచి మందు.డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు.

చెట్టు వేళ్లను నూరి నొప్పిపెట్టే పన్నుమిఓద పెట్టుకుంటే నొప్పీ తగ్గుతుంది.ఖర్జూరం తినడము వలన మలబద్ధకం తగ్గుతుంది, ఎముకలకు బలం వస్తుంది.

ఖర్జూర పండు పూర్తిగా ఐరన్ కలిగి ఉంటుంది.అలాని దానిలోంచీ తీసిన ఐరన్ తో ఇల్లుక ట్టే ప్రయత్నం మాత్రం చేయకండేం!ఇది రక్తహీనతను తగ్గింస్తుంది.గాలి చొరని  డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే ఖర్జూరపండ్లు కనీసం నెలరోజులు నిల్వ ఉంటాయి.  బలవర్థకమైన ఆహారంలో భాగంగా ఖర్జూర సిరప్‌ను తేనెలా రోజూ కొద్దికొద్దిగా తీసుకుంటారు.

ఇస్లామిక్‌ దేశాల్లో రంజాన్‌ మాసంలో ఆల్కహాల్‌కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపేన్‌ లాంటి పానీయాన్ని తాగుతున్నారు. సహారా వాసులు గుర్రాలకు, ఒంటెలకు, కుక్కలకు ఎండు ఖర్జూరాల్ని ఆహారంగా ఇస్తారు.వీటిని రోజూ తింటే రోగ నిరోధకశక్తి పెరగటంతోపాటు, విష ప్రభావాన్నుంచి కూడా శరీరం తట్టుకో గలుగు తుందని మహమ్మద్‌ ప్రవక్త చెప్పినట్టు నమ్ముతారు. కాబట్టే అల్‌ అజ్వా ఖర్జూరాలకు పవిత్ర ఖర్జూరాలు అనే పేరు కూడా వచ్చింది.

మరిన్ని శీర్షికలు
navvunaaluguyugaalu