Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mee mata

ఈ సంచికలో >> శీర్షికలు >>

వైతరణి దాటని తల్లి - .

vaitarani datani talli
ఈ కధ వ్రాసినది సత్యనారాయణ మూర్తిగారు ఈయన పెద్ద రచయిత ఏమీకాదు ఔత్సాహిక రచయిత 70వ దశకములో  ఈయన  ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డ్రాఫ్ట్స్ మన్, అంటే చిరు ఉద్యోగిగా పనిచేస్తుండేవాడు.  ఆయన మానాన్న గారు రేపల్లెలో  ఇంజనీరుగా పనిచేస్తున్నప్పుడు మా నాన్న గారిదగ్గర పనిచేసేవాడు ఆయన ఇరిగేషన్ శాఖలో పనిచేసే పెద్ద ఆఫీసర్ల అవినీతిని ఇతివృత్తముగా తీసుకొని "అవినీతి కధలు"అనే శీర్షిక క్రింద ఆంధ్ర ప్రభ వారపత్రికలో ప్రచురించేవాడు.  ఆ అవినీతికధలలో ఆఖరుది వైతరణి దాటని తల్లి. అంతవరకు నిరాఘాటంగా జరిగిన ఆయన రచనావ్యాసంగము ఈ కథతో బ్రేక్ పడింది, ఎందుకంటే అంతకు ముందు వ్రాసిన కధలు రిటైర్ అయినా అధికారులగురించి , కానీ ఈ  కధ అప్పటి పెద్ద ఇంజనీరుగారిని ఉద్దేశించి వ్రాసినది ఫలితముగా ఆయనకు దూరప్రాంతాలకు బదిలీ ఇబ్బందులు తప్పలేదు 

నిజానికి ఆ రోజుల్లో రచయిత కధలలో ప్రస్తావించిన అవినీతి ఈ రోజులతో పోలిస్తే చాలా తక్కువ.  ఆనాటి అధికారులు  అవినీతిలో చేపలైతే నేటి అధికారులు తిమింగలాలు.ఈ కధను అవినీతి కధ అనేదానికన్నా నీతి  కధ అని అనవచ్చుఎందుకంటే కధలో రచయిత ఒక నీతి చెపుతాడు
అసలు కథలోకి వద్దాము :పాత్రల పేర్లు నాకు సరిగా గుర్తులేవు అందుచేత కల్పితమైన పేరుతో కథను చెపుతున్నాను .

పరంధామయ్యగారు ఇరిగేషన్ శాఖలో చిన్న ఇంజనీరుగా చేరి అంచెలంచెలుగా ప్రమోషన్లు పొంది సూపరిండెంట్ ఇంజనీర్ స్థాయికి ఎదిగాడు ఆ రోజుల్లో పనులు బాగా ఉన్న ఒక సర్కిల్ కు నియమింపబడ్డాడు ఆయన క్రింద ఎక్జ్యుక్యూటివ్ ఇంజనీర్లు అసిస్టెంట్ ఇంజనీర్లు జూనియర్ ఇంజనీర్లు లాంటి అధికార్లు ఉండేవారు. మనిషికి పూజ పునస్కారాలు ఎక్కువ ఇంట్లో ఎప్పుడు ఆయన లేదా వాళ్ళావిడ ఎప్పుడు ఏదో  పూజలు వ్రతాలు చేయిస్తూ ఉండేవాడు. దేనిదారిదానిదే లంచాలు తీసుకోవటములో ఏమి మొహమాట పడేవాడు కాదు.

అవినీతి అనేదాని కన్నాకక్కుర్తి అంటే బాగా ఉంటుంది ఎందుకంటే కేంపులకు వెళ్ళినప్పుడు క్రింది అధికార్లకు మందుల చీటీలు ఇచ్చి" చీరాలలో దొరక లేదుగాని ఇక్కడ దొరికితే కాసిని ఎక్కువగానే తీసుకోండి" అని  అనేవాడు. "పేటేరు నేత చీరలు బాగుంటాయిట మాఆవిడ అడిగింది ఈ సారి మీరు ఎవరైనా ఆఫీసు పని మీద  చీరాల వచ్చేటప్పుడు నాలుగు చీరలు తీసుకు రండి,ఒకటి  సెలెక్ట్ చేసుకొని  మిగతావి వాపసు ఇస్తుంది " అని అనేవాడు. వెళ్లిన చీరలు తిరిగివచ్చేవి కావు .

ఈ విధముగా ఆయన  సాగేది ఆయనతో పాటు ఆయన తల్లికూడా ఉండేది ఆవిడ పెద్దావిడ . వయస్సు  అనారోగ్యము వల్ల స్వర్గస్తురాలైంది . ఒక కవిగారు అన్నట్లు డబ్బులేదా అధికారము ఉన్న వాళ్ళిళ్ళలో ఏదైనా ఘనముగా జరగాల్సిందే.ఖర్చు వాళ్ళదైతేగా. రాజుగారు తలచుకుంటే  కొదువ అన్నట్లు ముసలావిడ అంత్యక్రియలు ఘనముగా జరిగినాయి ఆ తరువాత కార్యక్రమాలకు ఖర్చునిర్వహణ బాధ్యత  ఆయన తన క్రింది అధికారులకు అప్పజెప్పి ఏలోటులేకుండా తన తల్లి కర్మకాండలు  యధావిధిగా జరగాలని క్రింది అధికారులకు హుకుమ్ జారీ చేశాడు
పై అధికారి ఆదేశానుసారము ఒకాయన  గోదానము,ఇంకొక ఆయన సువర్ణ దానము, మరొక ఆయన భూదానము ఈవిధముగా దానాల ఖర్చు భోజనాల ఖర్చు ఇతర  ఖర్చులు భరించి ఆయన తల్లి కర్మకాండలు ఘనముగా జరిపించారు.

చూసినవారు  చుట్టాలు,"పరంధామయ్య గారికి తల్లి అంటే ఎంత ప్రేమో ఈ రోజుల్లో ఇంత శాస్త్రోత్తకముగా అన్నిదానాలు ఇచ్చి కర్మకాండ జరిపించాడు ఆ తల్లికి తప్పకుండా పుణ్యగతులు లభిస్తాయి"అని అందరూ అంటూ సుష్టుగా భోజనముచేసి తల్లి జ్ఞాపకార్ధము ఇచ్సిన భగవత్ గీత పుస్తకాలు స్టీలు పాత్రలు తీసుకొని వెళ్లారు.

కొంతకాలానికి ఆయన పదవీ విరమణ చేయటము , స్వగ్రామానికి వెళ్ళటము తరువాత కొంతకాలానికి చనిపోవటము జరిగింది . ఆయన కొడుకులు, ఆయనతల్లికి, ఆయన చేసినంత ఘనముగా కాకపోయినా వాళ్ళ సొంత ఖర్చుతో యధావిధిగా శాస్త్రోక్తముగా వాళ్ళ తండ్రికి కర్మ కాండలు జరిపించారు . మన పరంధామయ్య గారు దశదిన వార కర్మలు పూర్తి అయినాక పరలోక యాత్ర సాగించారు .ఆయన ప్రయాణములో ఆయనకు తన తల్లి వైతరిణి నది దాటకుండా ఇవతలి ఒడ్డునే ఉండిపోవటము చూసాడు.

ఆశ్చర్యముతో ,"అమ్మా నీ కర్మకాండలు అన్ని సక్రమముగా ఘనముగా అన్ని దానాలు, ప్రత్యక్ష గోదానముతో సహా చేసానుకదా ఎందుకు నీవు వైతరణి దాటి స్వర్గానికి వెళ్ళలేదు ఇక్కడే ఉండిపోయినావు ? " అని అడిగాడు.

దానికి తల్లి ,"వాళ్ళు ఎవరు నా కన్నకొడుకులు కాదు కదా? నాయనా వాళ్ళుగోదానము, భూదానము వగైరాలు చేస్తే నాకు ఫలితము ఎలా వస్తుంది నాయనా ? నా కర్మ ఇంతే ",అని భాధ  పడింది  ఇదండీ కధ ఈ పాటికి పాఠకులకు నీతి అర్థమయి ఉంటుంది "అవినీతి సొమ్ముతో చేసిన పుణ్యకార్యాలవల్ల ఏమి పుణ్యము లేదా ఫలితము రాదు" ముఖ్యముగా కొడుకులు  నిర్వహించవలసిన పితృ కార్యాలకు .

కొసమెరుపు :- మా నాన్నగారు రిటైర్ అయినాక ఒకసారి బస్ స్టాండ్ లో మానాన్నగారిదగ్గర పనిచేసిన డ్రైవర్ కనిపించి పలకరించాడు మాములు పలకరింపులు అయినాక డిపార్టుమెంట్ గురించి అడిగాను దానికి ఆ డ్రైవర్ పెద్దగా చదువుకోకపోయిన మారిన ఆవినీతి స్థాయిలను చక్కగా చెప్పాడు "అయ్యగారు పనిచేసే రోజుల్లో కాంట్రాక్టర్ల బిల్లులను(కాంట్రాక్టర్లకు చెల్లించ వలసిన మొత్తాలు)  ఆఫీసులో తయారుచేసేవారు ప్రస్తుతము కాంట్రాక్టర్లు ఇంజనీర్లు లాడ్జీలలో కూర్చుని నీకెంత నాకెంత అని లెక్కలు తయారుచేసుకుంటున్నారు నాపని అయ్యగార్లను  లాడ్జీలకు తిప్పటమే పూర్వములా పనిమీదకు కాదు" అని నిర్వేదంగా చెప్పాడు

అంబడిపూడి శ్యామసుందర రావు
మరిన్ని శీర్షికలు
aratikaya pulusu