Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

కార్తితో ఇంటర్యూ

interview with karthi

తెలుగులో ఏ క‌థా న‌చ్చ‌డం లేదు - కార్తి

కార్తి ప్ర‌యాణం కాస్త విభిన్నంగానే సాగుతోంది.
పూర్తిగా క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ల‌వైపు ప‌రుగులు పెట్ట‌డం లేదు.
అలాగ‌ని ప్ర‌యోగాలూ చేయ‌డం లేదు.

ఈ రెండింటినీ మిక్స్ చేసే ఫార్ములాని న‌మ్ముకొన్నాడు. అందుకే ఆవారా, నా పేరు శివ‌, ఊపిరిలాంటి మంచి సినిమాలొచ్చాయి. ఇప్పుడు కాష్మోరా ట్రైల‌ర్ల‌తో ఆశ్చ‌ర్య ప‌రుస్తున్నాడు. 'ఇది కార్తియేనా...?' అంటూ ముక్కుమీద వేలేసుకొనేలా చేస్తున్నాడు. దీపావ‌ళి కానుక‌గా ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా కార్తితో చేసిన చిట్ చాట్ ఇది.

* హాయ్ కార్తీ..
- హాయ్ అండీ..

* ఊపిరి త‌ర‌వాత తెలుగులో విరివిగా సినిమాలు చేస్తార‌నుకొన్నాం.. కానీ చేయ‌ట్లేదేం..?
- నిజంగా నాకు తెలుగు సినిమాల్లో న‌టించ‌డం అంటే చాలా ఇష్టం. ఊపిరి సినిమా చేస్తున్న‌ప్పుడు చాలా ఎంజాయ్ చేశాను కూడా. ఊపిరి త‌ర‌వాత తెలుగులో నేను చాలా క‌థ‌లు విన్నా. కానీ.. ఏదీ న‌చ్చ‌లేదు.

* మీకిష్ట‌మైన  ద‌ర్శ‌కుల్ని ప‌ట్టుకొంటే తెలుగు ప్రాజెక్ట్ ఈజీగా ప‌ట్టాలెక్కించొచ్చు క‌దా?
- తెలుగులో ద‌ర్శ‌కులంతా బిజీ బిజీగా ఉన్నారండీ. ఒకొక్క‌రి కోసం ముగ్గురేసి హీరోలు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారు. ఏం చేయాల‌న్నా కాస్త ఓపిక ప‌ట్టాలి.

*  ఏ ద‌ర్శ‌కుడితో ప‌నిచేయాల‌ని వుంది?
- ఆ జాబితా చాలా పెద్ద‌దే ఉంటుంది. తెలుగులో అంతా స్టార్ ద‌ర్శ‌కులే. ఒకొక్క‌రిదీ ఒక్కో శైలి. క‌మ‌ర్షియ‌ల్ విలువ‌ల్ని ఓ స‌రికొత్త కోణంలో చూడ‌గ‌ల‌రు.. తీయ‌గ‌ల‌రు. నాకైతే అంద‌రితోనూ ప‌నిచేయాల‌ని వుంది.

* త‌మిళంలో తీస్తున్న సినిమానే తెలుగులోనూ రీషూట్ చేసి చేయొచ్చుగా?
- తెలుగులో చేయాల‌నుకొంటున్న‌ప్పుడు పూర్తిగా తెలుగు న‌టీన‌టుల‌తో, టెక్నీషియ‌న్ల‌తో తీయాలి. తెలుగు నేటివిటీకి త‌గిన క‌థ ఉండాలి. అందుకే నేనూ అందుకోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్నా. 

* ఇంత‌కీ కాష్మోరా క‌థేంటి??
- క‌థేంటో ఇప్పుడే చెప్ప‌కూడ‌దు. తెర‌పైచూడాల్సిందే. 

* క‌నీసం జోన‌ర్ అయినా చెప్తారా, లేదంటే  హార‌ర్ సినిమా అనుకోవొచ్చా?
- ఇది ఒక్క జోన‌ర్‌కి ప‌రిమితం కాదు. హార‌ర్ ఉంటుంది. కొంత వ‌ర‌కే. హార‌ర్ కంటే మేం ఫ‌న్‌, ఫాంట‌సీపైనే ఎక్కువ దృష్టి పెట్టాం. 

* గ్రాఫిక్స్ కోసం ఎక్కువ ఖ‌ర్చు పెట్టిన‌ట్టు, క‌ష్ట‌ప‌డిన‌ట్టు అనిపిస్తోంది?
- అవును. ఎందుకంటే మా సినిమా కంటే ముందు బాహుబ‌లి అనే ఓ విజువ‌ల్ వండ‌ర్ వ‌చ్చింది. అది చూశాక విజువ‌ల్ ఎఫెక్ట్స్ రేంజ్ ఏంట‌న్న‌ది ఆడియ‌న్స్‌కి తెలిసిపోయింది. బాహుబ‌లి త‌ర‌వాత వ‌చ్చే ప్ర‌తీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ సినిమానీ అదే స్థాయిలో ఉహించుకొంటారు. దానికి ఏమాత్రం త‌గ్గినా నిరుత్సాహ‌ప‌డ‌తారు. అందుకే బాహుబ‌లి చూశాక‌.. మా విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప్లాన్ పూర్తిగా మారిపోయింది. రెండు నెల‌లు గ్యాప్ తీసుకొని.. గ్రాఫిక్స్‌ని ప్ర‌త్యేకంగా రూపొందించాం. ఆ విష‌యంలో మాత్రం ఎవ్వ‌రూ నిరుత్సాహ‌ప‌డ‌రు.  

* న‌టుడిగా, హీరోగా కాష్మోరా మీకు సంతృప్తినిచ్చిందా?
- ఏ సినిమా అయినా.. న‌టుడిగా నేనెంత సంతృప్తిప‌డ్డాను?  అనే విష‌యంపైనే ఎక్కువ దృష్టి పెడ‌తా. నాక‌దే ముఖ్యం కూడా. ఈ సినిమాలో ఓ గెట‌ప్ కోసం గుండు కొట్టించుకొన్నా. ఆ స‌మ‌యంలో న‌న్ను చాలామంది భ‌య‌పెట్టారు. కానీ.. నేను లెక్క చేయ‌లేదు. ఓ పాత్ర కోసం ఎక్స్‌ట్రా హోం వ‌ర్క్ చేసిన‌ప్పుడు ఓ ర‌క‌మైన కిక్ ల‌భిస్తుంది. అదే నాకు ముఖ్యం.

* కాష్మోరా బ‌డ్జెట్ బాగా పెరిగిపోయింది... అదేం ఇబ్బంది పెట్ట‌లేదా?
- ఇలాంటి సినిమాకి ఆ మాత్రం ఖ‌ర్చు అవ‌స‌ర‌మే. పైగా ఈమ‌ధ్య బ‌డ్జెట్ ప‌రిమితుల్ని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. క‌థ డిమాండ్ చేసింత మేర‌.. ఖ‌ర్చు చేయాల్సిందే. మేం రూ.60 కోట్లు ఖ‌ర్చు పెట్టినా, తెర‌పై వంద కోట్ల ఎఫెక్ట్ క‌నిపిస్తుంది. 

* క‌మ‌ర్షియ‌ల్ సినిమా, ప్ర‌యోగాత్మ‌క క‌థ‌.. ఈ రెండింటిలో మీరు దేన్ని ఎంచుకొంటారు?
- ప్ర‌తీ సినిమా ఓ ప్ర‌యోగం లాంటిదే. అది ఆడుతుందా, లేదా? అనేది ముందు చెప్ప‌డం క‌ష్టం.  క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌న్నీ ఆడేస్తాయా?  పూర్తిగా కొత్త క‌థ చెబుతామ‌న్నా చూస్తార‌న్న గ్యారెంటీ ఉందా?   నాకైతే క‌థ చెబుతున్న‌ప్పుడు అది ప్ర‌యోగాత్మ‌క సినిమానా, లేదంటే క‌మ‌ర్షియ‌ల్ సినిమానా అనేది ఆలోచించ‌ను. క‌థ విన‌గానే.. భ‌లే ఉందే అనిపించాలి. ఏదో ఓ థ్రిల్లింగ్ మూమెంట్ ఉండాలి. అలాగైతేనే ఒప్పుకొంటా. ఏ సినిమా చేసినా డ‌బ్బులు రావ‌డం ముఖ్యం. మ‌న సినిమాలో అన్ని రుచులూ ఉండాల్సిందే.

* మ‌ణిర‌త్నం సినిమా ఎలా ఉండ‌బోతోంది?
- ఆయ‌న సూప‌ర్బ్ ఫిల్మ్‌మేక‌ర్‌. నేనేతే సెట్‌లో ప్ర‌తీ క్ష‌ణాన్నీ ఎంజాయ్ చేస్తున్నా. ఆయ‌న కూడా సినిమా అదే త‌ర‌హాలో తీస్తున్నారు.

* ఇక ముందు స్పీడు పెంచుతారా?
- నేనేం స్లో కాదండీ. చేయాల్సిన స్థాయిలోనే సినిమాలు చేశా. కాక‌పోతే క‌థ విష‌యంలో ఓ ప‌ట్టాన రాజీకి రాలేను. అందుకోస‌మే టైమ్ ప‌ట్టేస్తుంటుంది. 

* కాష్మోరా గురించి చివ‌రిగా ఏం చెబుతారు?
- ఇదో పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా. మాస్‌కి బాగా న‌చ్చుతుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ కోసం చాలా ఖ‌ర్చు పెట్టాం. దాని రిచ్‌నెస్ తెలియాలంటే థియేట‌ర్లోనే ఈ సినిమా చూడండి.

* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌


- కాత్యాయని 

మరిన్ని సినిమా కబుర్లు
movie review