బుల్లితెర హాటెస్ట్ యాంకర్ అనసూయ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె కూడా ఐటెం సాంగ్స్‌కి సై అంటున్నానంటోంది. ఇదేంటి అనసూయ ఏంటీ, ఐటెం సాంగ్ ఏంటీ, గతంలో ఈ విషయంలోనే కదా అమ్మడు ఎంతో రచ్చ చేసింది. ఏకంగా పవన్ సినిమానే అయినా కానీ, ఐటెం సాంగ్‌లో మాత్రం నేను ససేమీరా నటించను అన్న అనసూయ ఇప్పుడు కావాలి కావాలి అంటూ ఐటెం సాంగ్‌లో నటించడమేంటి అని చెవులు కొరుక్కుంటున్నారు. అయితే లైమ్ లైట్‌లో ఉండాలంటే తప్పదు వెండితెరపై ఏ అవకాశాన్ని వదులుకోకూడదు అనే విషయాన్ని ఆలస్యంగా తెలుసుకుంది ఈ ముద్దుగుమ్మ. 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో నాగార్జునతో రొమాన్స్ చేసింది ముద్దుగుమ్మ అనసూయ.
ఆ తర్వాత వరుసగా అవకాశాలు క్యూ కట్టేస్తాయని భావించింది కానీ, ఆ తర్వాత 'క్షణం' సినిమా తప్ప మరో అవకాశం రాలేదు అనసూయకి. దాంతో రూటు మార్చేసింది. ఒక పక్క తనకు అత్యంత కాంపిటేషన్ అయిన రేష్మీ ఏమో గ్లామరస్ హీరోయిన్‌గా దూసుకెళ్లిపోతోంది. అందుకే తాజాగా సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న 'విన్నర్' సినిమాలో అమ్మడికి ఐటెం సాంగ్‌లో అవకాశం వచ్చిందట. వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా, వెంటనే అందిపుచ్చేసుకుంది. ఆ రకంగా ఈ బ్యూటీ సాయి ధరమ్‌తో అద్దిరిపోయే ఐటెం సాంగ్‌లో చిందేయనుందన్న సంగతి బయటికి వచ్చేసిందన్న మాట. చూద్దాం ఇకపై అయినా అనసూయకు మంచి అవకాశాలు వస్తాయేమో!
|