Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar steps with rattaalu

ఈ సంచికలో >> సినిమా >>

దటీజ్‌ బాలయ్య.. ఫ్లేవర్‌ అదిరిందయ్యా!

that is balayya ..

క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాలో నటిస్తున్నారు. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం బాలయ్యకు 100వ చిత్రం. శ్రియ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. హేమా మాలిని బాలకృష్ణకు తల్లిగా కీలక పాత్ర పోషిస్తోంది. సంక్రాంతి బరిలో ఈ సినిమాను ఉంచేందుకు క్రిష్‌ అండ్‌ టీం రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌ మీదుండగానే బాలయ్య తన నెక్స్ట్‌ మూవీని ఎప్పుడో అనౌన్స్‌ చేసేశాడు. అదే కృష్ణవంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న 'రైతు' సినిమా. ఇది కూడా బాలయ్యకు ఎంతో ప్రత్యేకం.

ఎందుకంటే ఇది రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా కావడం విశేషం. అంతేకాదు ఈ సినిమాకు కూడా బాలీవుడ్‌ ఫ్లేవర్‌ అద్దనున్నాడు బాలయ్య. 'శాతకర్ణి'లో బాలీవుడ్‌ బ్యూటీ హేమామాలిని నటిస్తే, ఈ సినిమాలో ఏకంగా బిగ్‌బీ అమితాబ్‌ బచ్చనే నటిస్తుండడం విశేషం. అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రను పోషిస్తున్నారని సమాచారమ్‌. దాదాపుగా ఆ పాత్రకు బిగ్‌బీ ఓకే అన్నారని కూడా తెలుస్తోంది. 'శాతకర్ణి' సినిమా పూర్తి కాగానే బాలయ్య ఈ సినిమాని సెట్స్‌ మీదికి తీసుకెళ్లనున్నారట. అరటే బాలయ్య యంగ్‌ హీరోలతో పోలిస్తే, సూపర్‌ ఫాస్ట్‌గా ఉన్నారని చెప్పవచ్చు. ఒక సినిమాతో బిజీగా ఉన్నప్పుడే మరో సినిమాని కూడా లైన్‌లో పెట్టేయడమే కాకుండా అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కూడా ఇచ్చేశారు. 
 

మరిన్ని సినిమా కబుర్లు
anasuya ready to item songs