ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ వరుస విజయాలతో రేస్‌లో ముందుంది. ఈ ఏడాది ఈ ముద్దుగుమ్మకి అంతా బాగా కలిసొచ్చింది. వరుసగా మూడు పెద్ద హిట్లు ఈమె ఖాతాలో ఉన్నాయి. ఇవి కాక ఆమె చేతిలో బోలెడన్ని సినిమాలు. చిన్నా, పెద్దా తేడా లేకుండా, సూపర్ స్టార్ నుండి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా వరకూ ఈమె నటించబోతున్న సినిమాల లిస్టులో ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఆమె తన తమ్ముడు అమన్‌ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనుకుంటుందట. అమన్‌కి సినిమాలంటే చాలా ఇష్టమట. నటనపై ఉన్న ఆశక్తితో తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాడట. రకుల్ కూడా తెలుగు బాగానే మాట్లాడుతుంది.
అంతకన్నా బాగా అమన్ తెలుగులో మాట్లాడుతాడట. అందుకే త్వరలోనే ఓ మంచి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట. మరో విషయం ఏంటంటే స్టార్ హీరోయిన్ రకుల్ తమ్ముడు కాబట్టి అమన్‌కి హీరోగా మాత్రమే నటించాలని అయితే ఏం లేదంట. ఏ రోల్‌లో అయినా మెప్పిస్తాడంట. అది విలన్ రోల్ అయినా ఓకేనట. ఈ విషయాన్ని రకుల్‌ప్రీత్ సింగ్ స్వయంగా చెబుతోంది. అంటే టాలీవుడ్ దర్శక, నిర్మాతలకు రకుల్ తన తమ్ముడి గురించి పెద్ద హింటే ఇచ్చింది. కథ మంచిదైతే ఆ సినిమాలో మంచి రోల్‌లో నటించడానికి తమ్ముడు అమన్ సిద్దంగా ఉన్నాడంటోంది. అంటే అమన్ కోసం మన డైరెక్టర్లు హీరో పాత్ర రెడీ చేస్తారో, విలన్ పాత్ర రెడీ చేస్తారో చూడాలి మరి. మొత్తానికి టాలీవుడ్‌కి మరో యంగ్ అండ్ ఎనర్జిటిక్ కుర్రోడు అమన్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేద్దాం!
|