చిరంజీవి సినిమా 'ఖైదీ నెంబర్ ౖ50' రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. సంక్రాంతికి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ లోగా సినిమాకి సంబంధించిన టీజర్‌ని విడుదల చేశారు. ఓ రేంజ్‌లో ఊపు ఊపేసింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ప్యాన్స్ పండగ చేసుకునే లోపే ఓ ఆడియో సాంగ్ స్టిల్స్‌ని కూడా విడుదల చేశారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్‌లో ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో వీర లెవల్లో హల్ చల్ చూపిస్తోంది. 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు..' అంటూ సాగే ఈ సాంగ్‌లో చిరంజీవి డాన్సింగ్ స్టిల్స్‌కి ఫ్యాన్స్‌లో ఉత్కంఠ రెట్టింపయిపోయింది. ఈ ఎంజాయ్‌మెంట్‌లో ఉండగానే ఈ సాంగ్ మేకింగ్ వీడియో క్లిప్పింగ్స్‌ని విడుదల చేశారు. ఇక ఈ వీడియో చేసే సందడి అంతా ఇంతా కాదు.
ఈ వీడియోలో చిరు స్టెప్పులు, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఎంతో మనస్పూర్తిగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న తీరు చూస్తుంటే చిరంజీవి డాన్సుల్లో ఎంత జోరు ప్రదర్శించారో వేరే చెప్పనక్కర్లేదు. 'అరే శేఖర్ నీ జన్మకిది చాలురా' అంటూ తనకు తాను శభాష్ అని చెప్పుకుంటున్నాడు శేఖర్ మాస్టర్. అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఆనందానికి అయితే ఇక హద్దులే లేవు. ఇవన్నీ సినిమాపై ఇంతవరకూ ఉన్న అంచనాల్ని పదింతలు చేస్తున్నాయి. కాజల్ అగర్వాల్ ఈ పాటలో చాలా అందంగా కనిపిస్తోంది. చిరంజీవి రీ ఎంట్రీలో వస్తోన్న సినిమా ఇది. రామ్ చరణ్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న తొలి చిత్రం. అందుకే చరణ్ ఏ విషయంలోనూ రాజీ పడకుండా పబ్లిసిటీ విషయంలో ఇరగదీసేస్తున్నాడు. త్వరలోనే ఆడియో ఫంక్షన్ వేడుకలు కూడా జరగనున్నాయి. వినాయక్ దర్వకుడు ఈ సినిమాకి.
|