Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
know sathakarni budjet

ఈ సంచికలో >> సినిమా >>

సన్నీలియోన్‌ సంచలనం

sunny leaon sensation

అలనాటి సూపర్‌ హిట్‌ సాంగ్‌ 'లైలా ఓ లైలా' దేశాన్ని ఊపేసింది. జీనత్‌ అమన్‌ ఆ పాటలో ఎంతగా ఒదిగిపోయిందో అందరికీ తెలుసు. అంతటి ట్రెండింగ్‌ సాంగ్‌ని రీమిక్స్‌ చేయడమంటే పెద్ద సాహసమే అవుతుంది. అది కూడా సన్నీలియోన్‌తో చేయడమంటే ఇంకా పెద్ద సాహసం. ఆ పాటకి సన్నీలియోన్‌ తప్ప ఇంకెవరైనా తక్కువేనని అనుకున్నారేమోగానీ 'రయీస్‌' సినిమా కోసం ఆమెనే ఫిక్స్‌ చేశారు. ఆ సాహసం ఫలించింది. జీనత్‌ అమన్‌ స్థాయిలో ఎక్స్‌ప్రెషన్స్‌ పలికించలేకపోయినా ఆమెను మించి అందాల విందు చేసింది సన్నీలియోన్‌. తద్వారా లేటెస్ట్‌ 'లైలా' యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌ అయ్యింది.

ఇంతకుముందు సన్నీలియోన్‌ చేసిన డాన్సులతో పోల్చితే 'లైలా'లో ఆమె డాన్సులు చాలా గట్టిగానే చేసిందని చెప్పక తప్పదు. జీనత్‌ అమన్‌ అయితే కేవలం తన ఎక్స్‌ప్రెషన్స్‌తోనే 'లైలా' పాటకి ఊపు తెచ్చింది. తన ప్లస్సులేంటో మైనస్‌లు ఏంటో సన్నీలియోన్‌కి తెలుసు. అందుకే ఎక్స్‌ప్రెషన్స్‌ కన్నా గ్లామర్‌నే నమ్ముకుంది. ఏదేమైనా 'రయీస్‌' టీమ్‌ అనుకున్నట్లుగా 'లైలా' సాంగ్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. షారుక్‌ఖాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం రూపొందింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ సినిమా విడుదలవుతుంది. షారుక్‌ సరసన మహీరాఖాన్‌ అనే పాకిస్తానీ నటి హీరోయిన్‌గా నటించడం 'రయీస్‌'లో ఇంకో హైలైట్‌ పాయింట్‌. రాహుల్‌ డోలాకియా ఈ చిత్రానికి దర్శకుడు. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondichooddam