'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా. చారిత్రక నేపధ్యం ఉన్న సినిమా. ఇలాంటి సినిమాలను సాధారణంగా అనుకున్న బడ్జెట్‌లో తెరకెక్కించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఇక్కడ ఉన్నది దిగ్రేట్ డైరెక్టర్ క్రిష్. అందుకే అనుకున్న బడ్జెట్‌లో ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా బడ్జెట్‌ని చూసి షాకవ్వడం తమ వంతవుతోంది సినీ విశ్లేషకులకు. అంత రిచ్‌గా ఉంది మరి ఆ ట్రైలర్. విజువల్‌గా అద్భుతంగా కనిపిస్తోంది ఈ సినిమా ట్రైలర్. 55కోట్ల బడ్జెట్‌లో సినిమాని ఇంత అద్భుతంగా తెరకెక్కించేశాడే క్రిష్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంతా. నిజానికి ఈ బడ్జెట్ ఈ సినిమాకి చాలా తక్కువే అంటున్నారు. ఈ ట్రైలర్‌కు యూ ట్యూబ్‌లో 50 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇదో సంచలనమే.
ట్రైలర్‌కే ఇంతగా రెస్పాన్స్ ఉంటే ఇక సినిమాకి ఏ రేంజ్‌లో రెస్పాన్స్ అదిరిపోతుందో. ఖచ్చితంగా 100 కోట్ల మార్కెట్‌ని టచ్ చేయడం ఖాయం అని ట్రేక్ టాక్. సంక్రాంతి తెలుగు వారి పండగ. ఆ పండక్కి, అచ్చమైన తెలుగు సినిమా అయిన 'శాతకర్ణి' సినిమా విడుదలవుతోంది. ముద్దుగుమ్మ శ్రియ ఈ సినిమాలో శాతకర్ణి భార్యగా నటిస్తోంది. చాలా అందంగా కనిపిస్తోంది ట్రైలర్‌లో. బాలీవుడ్ బ్యూటీ హేమామాలిని పాత్ర సినిమాకి కీలకం. శాతకర్ణి తల్లి పాత్రలో నటిస్తోంది. బాలకృష్ణకి 100వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు ప్రజలు గర్వించదగ్గ సినిమా అవుతుంది ఇది. 'శాతకర్ణి' పాత్ర నా కల. ఆ కల ఈ సినిమాతో నెరవేరుతుంది. ఈ సినిమాలో నటించడం నా అదృష్టం అంటూ బాలకృష్ణ స్వయంగా తెలిపారు.
|