Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
samanta riple dhamakha

ఈ సంచికలో >> సినిమా >>

.

suprim hero javan

సుప్రీమ్‌ హీరో మెగా మేనల్లుడు జోరు మీదున్నాడు. ఆల్రెడీ 'విన్నర్‌' సినిమా సెట్స్‌ మీదుండగానే మరో సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. అదే 'జవాన్‌' సినిమా. బివియస్‌. రవి దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ సినిమా. సాయి ధరమ్‌ తేజ్‌ అంటే మెగా మేనల్లుడిగానే కాకుండా ఓ మంచి ఫ్రెండ్‌లా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితుడు. తన సినిమాలతో ఆడియన్స్‌ని కూడా బాగా ఆకట్టుకుంటున్నాడు. అలాగే గతేడాది 'సుప్రీమ్‌' సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ ఏడాది 'విన్నర్‌' అంటూ వస్తున్నాడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. స్పోర్ట్స్‌ నేపధ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పుడున్న సినిమాలన్నింట్లోనూ విభిన్నమైన కధాంశమట. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అలాగే తేజు యాక్టింగ్‌, డైలాగ్‌ డెలివరీ అంతా కొత్తగా ఉన్నాయి ఈ సినిమాలో. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమాలో చాలా అందంగా కనిపించడమే కాకుండా, ఆమె పాత్ర కూడా సినిమాలో చాలా కీలకంగా ఉండబోతోందట. గ్లామర్‌తో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపిస్తుందట రకుల్‌ ఈ సినిమాలో. ఇదిలా ఉండగా తేజు తాజా సినిమా 'జవాన్‌'ను ఇటీవలే ఘనంగా ప్రారంభించారు. అలాగే ఈ సినిమాలో 'జవాన్‌'గా కనిపించడం చాలా కొత్తగా ఉందంటున్నాడు సాయి ధరమ్‌ తేజ్‌. ఈ సినిమాలో తేజు సరసన 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' ఫేం మెహరీన్‌ కౌర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
subbiramireddy welwisher