Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nag  feel so exaitment

ఈ సంచికలో >> సినిమా >>

.

samanta riple dhamakha

సమంత తెలుగు సినిమాలు ఎందుకు చెయ్యట్లేదు? తమిళంలో మాత్రమే సినిమాలు ఎందుకు ఒప్పుకుంటోంది? ఇలా పలు అనుమానాలు తెలుగు నాట ఆమె అభిమానుల నుంచి వ్యక్తమయ్యాయి. సమంత కూడా మంచి ప్రాజెక్ట్‌ల కోసం ఎదురుచూసింది. అలా ఆమె ఎదురుచూపులు ఫలించాయి. తొలిసారిగా చరణ్‌తో సినిమా చేసే ఛాన్స్‌ దక్కింది సమంతకి. సుకుమార్‌ డైరెక్షన్‌లో చరణ్‌ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా ఎంపికైంది. ఇంకోవైపున, సమంత అక్కినేని వారింట కోడలిగా అడుగు పెట్టడం ఖాయమైపోయింది. ఇటీవలే సమంత - నాగచైతన్య నిశ్చితార్థం జరిగింది.

ఇలా రెండు గుడ్‌ న్యూస్‌లు వెంట వెంటనే సమంత అభిమానులకి చెప్పేసింది. ముచ్చటగా మూడో విశేషం కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంత ఎంపికైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి కెటియార్‌, సమంతకు చేనేత కార్మికులు రూపొందించిన చీరను బహూకరించారు. బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనిచేసేందుకు ఒప్పుకున్నందుకుగాను సమంతను అభినందించారు కెటియార్‌. అంటే ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం తరఫున చేనేత ప్రమోషన్‌లో సమంత తనదైన ముద్ర వేయనుందని అర్థం చేసుకోవాలి. ఓ వైపు సినిమాతోనూ, ఇంకో వైపు పెళ్ళి కబురుతోనూ, మరో వైపు చేనేతకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండటం ద్వారా ఓ మంచి కార్యక్రమంతోనూ జనంలోకి వచ్చింది సమంత. సమంత ట్రిపుల్‌ ధమాకాకి ఆమె అభిమానులు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. లేట్‌ అయినా, సమంత లేటెస్ట్‌గా వచ్చింది. 

మరిన్ని సినిమా కబుర్లు
suprim hero javan