'ధృవ'తో ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటించి, తిరుగులేని విజయాన్ని అందుకున్నాడు మెగా పవర్ స్టార్ చరణ్. తొలిసారిగా చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో అదే ఉత్సాహంతో మరో ప్రయెగానికి రెడీ అవుతున్నాడు. సుకుమార్, చరణ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఇది కూడా ఓ ప్రయోగాత్మక చిత్రమేనట. మామూలుగా సుకుమార్ సినిమాలన్నీ, ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రొమాంటిక్ జోనర్‌లో తెరకెక్కుతాయి. కానీ చరణ్‌తో తెరకెక్కించే సినిమాలో మాత్రం అలాంటివేమీ ఉండవట. చాలా కూల్ ఎంటర్‌టైనర్ అట. కానీ ఎవ్వరూ ఊహించని స్పెషాలిటీ అయితే ఈ సినిమాలో ఉందట.
అదేంటో అంటూ మెగా ప్యాన్స్ చాలా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏకంగా తెలుగు ఇండస్ట్రీలోనే ఇలాంటి సినిమా ఇంతవరకూ రాలేదంట. ఈ సినిమాకి ఇమేజ్‌తో సంబంధం లేదు. కేవలం ప్యాషన్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సినిమాలో చరణ్ నటించడం అంటే నిజంగా ఓ సాహసమే అంటున్నారు. పల్లెటూరి కుర్రాడి పాత్ర చరణ్‌ది అని మాత్రం తెలుస్తోంది. అయితే అందులోనే చాలా ట్విస్ట్‌లున్నాయట. అవేంటో ప్రస్తుతానికి సస్పెన్సేనట. రాశీఖన్నా, సమంతలు ఈ సినిమాలో చరణ్‌తో జతకడుతున్న ముద్దుగుమ్మలు. ఈ ఇద్దరూ తొలిసారిగా ఈ సినిమాలో చరణ్‌తో జత కట్టడం విశేషం.
|