ఆయన తెలుగు సినీ రంగానికి అత్యంత ఆప్తుడు. కళాబంధు అన్న పేరుని సార్దకం చేసుకుంటారాయన. సినిమాలకు చాలాకాలంగా దూరమైనప్పటికీ సినీ రంగంతో ఆయన అనుబంధం కొనసాగుతోంది. రాజకీయాల్లో బిజీ అయిపోయినప్పటికీ కూడా సినీ రంగాన్ని విస్మరించలేదాయన. సినీ కళామతల్లికి సేవ చేసుకుంటూ వెళుతున్నారు. ఆయనే కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి. సినిమాల్లో మొన్న 'ఖైదీ' సినిమాని అభినందిస్తూ ఓ ఫంక్షన్ నిర్వహించారు.
చిరంజీవి అంటే ఎంతో ఇష్టం ఆయనకి. చిరంజీవికి ఆప్తుడు, సన్నిహితుడు. అలాగే 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా విజయాన్ని అభినందిస్తూ ఓ కార్యక్రమం నిర్వహించారు. తెలుగు ఖ్యాతిని చాటి చెప్పే సినిమాని తెలుగు ప్రజలకు పరిచయం చేసిన బాలయ్యను ఎంతో అభిమానంగా సత్కరించారు. అలాగే డైరెక్టర్ క్రిష్‌ని పొగడ్తలతో ముంచెత్తేశారు. అంతే కాదు సుబ్బిరామిరెడ్డి మంచి సినీ పారిక్రశామిక వేత్త. ఈ రకంగా సినీ రంగంలోని ప్రముఖులకు సత్కారాలు చేస్తూ, పలు రకాల కార్యక్రమాలతో ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని చాటుకుంటాడు. ఆయన పిలిస్తే రాని సినీ ప్రముఖులు ఉండరు. చాలా కాలం తర్వాత ఆయన ఓ సినిమా చేస్తానంటున్నారు. అది కూడా మెగా ఫ్యామిలీతోనేనట. ఈ మధ్యనే ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు.
|