మెగా మేనల్లుడు త్వరలో 'విన్నర్'గా అలరించనున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. స్పోర్ట్స్ నేపధ్యంగా ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అలాగే ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. హాట్ యాంకర్ అనసూయ స్పెషల్ సాంగ్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ కానుందట. తాజాగా ఈ పాటని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ప్రముఖ యాంకర్ సుమ ఈ పాటను ఆలపించడం మరో విశేషం. ఈ పాట మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అలాగే తమన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మరో రెండు పాటలను సూపర్ స్టార్ మహేష్, ముద్దుగుమ్మ సమంతలు తమ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ నెల 24న శివరాత్రి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా సంగతి ఇలా ఉండగా, సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. 'జవాన్' టైటిల్‌తో రాబోతోన్న ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ పవర్ ఫుల్ జవాన్‌కి జంటగా నాని హీరోయిన్ మెహరీన్ కౌర్ ఎంపికైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది. ఈ లోగా మెగా డైరెక్టర్ వినాయక్‌తోనూ సాయి ధరమ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడనీ తాజా సమాచారమ్.
|