రవితేజ ఈజ్ బ్యాక్ అంటూ జోరుగా వచ్చేస్తున్నాడు. లేట్ అయినా లేటెస్టుగా రెండు సినిమాలకు సంతకం చేసేశాడు. రావడం రావడంతోనే తన కొత్త సినిమాల పోస్టర్స్‌ని కూడా రిలీజ్ చేస్తూ ఐ యామ్ బ్యాక్ అంటూ కిక్కెక్కించాడు మాస్ రాజా రవితేజ. 'సుప్రీమ్' సినిమాతో సక్సెస్ జోరు మీదున్న డైరెక్టర్ అనిల్ రావిపూడితో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. 'రాజా ది గ్రేట్' వెల్‌కమ్ టు మై వరల్డ్ అనే క్యాప్షన్‌తో స్టైలిష్ లుక్‌తో ఎంట్రీ ఇచ్చేశాడు రవితేజ.
ఈ సినిమాలో 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమాతో క్యూట్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్ ఇప్పుడు రవతేజతో జత కడుతోంది. విభిన్న కధాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదో ప్రయోగాత్మక చిత్రమట. రవితేజ ఇంతవరకూ చేసిన చిత్రాల్లోకెల్లా విభిన్నంగా ఉండబోతోందట. ఇందులో రవితేజ క్యారెక్టర్‌పై కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. మరో పక్క 'టచ్ చేసి చూడు' అనే టైటిల్‌తో మరో సినిమా కూడా రవితేజ లైన్‌లో పెట్టేశాడు. విక్రమ్ సిరికొండ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ముద్దుగుమ్మ రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మొత్తానికి రవితేజ నుండి లాస్ట్ ఇయర్ సినిమాలేమీ రాని లోటు ఈ ఇయర్‌లో తీరిపోతుందన్న మాట. మాస్ రాజానా మజాకానా!
|