నాని హీరోగా వచ్చిన 'కృష్ణ గాడి వీర ప్రేమగాధ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మెహరీన్ కౌర్. తొలి సినిమాకే చాలా ఎట్రాక్ట్ చేసింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో అమ్మడు తెలుగు ఇండస్ట్రీ దృష్టిని బాగా ఆకర్షించింది. అసలే హీరోయిన్స్ కొరత ఉన్న టాలీవుడ్‌లో ఈ అమ్మడి రాకతో ఓ మంచి హీరోయిన్ వచ్చిందనే అనుకున్నారంతా. వరుస అవకాశాలు అమ్మడికి జోరెత్తుతాయని భావించారు. కానీ ఆ సినిమా తర్వాత వెంటనే ఈ ముద్దుగుమ్మకి అంతగా అవకాశాలు రాలేదు.
కానీ ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ జోరును తన కన్నా ముందొచ్చిన భామలు కూడా తట్టుకోలేకపోతున్నారంటే నమ్మడం సాధ్యమా. అంతలా ఉంది అమ్మడికి అవకాశాల జోరు. వరుస సినిమాలు ఈ ముద్దుగుమ్మ ముందు వచ్చి వాలుతున్నాయి. మెగా మేనల్లుడు హీరోగా తెరకెక్కుతోన్న 'జవాన్' సినిమాలో మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే రవితేజ కొత్త సినిమా 'రాజా ది గ్రేట్' లోనూ ఈ అమ్మడే హీరోయిన్. ఇవి కాక మరో యంగ్ హీరో సందీప్ కిషన్‌తోనూ ఈ ముద్దుగుమ్మ జత కట్టబోతోంది. ఇవన్నీ కాక అమ్మడు బాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన 'ఫిలౌరీ' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అనుష్క శర్మ కీలకపాత్రలో నటిస్తూ, నిర్మిస్తోన్న చిత్రమిది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా నానితో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఇంత బిజీగా ఉంటూనే, ఏకంగా బాలీవుడ్ దాకా తన సినీ జర్నీ కొనసాగిస్తోందంటే చిన్న విషయమేమీ కాదు.
|