Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
katamarayudu is comming

ఈ సంచికలో >> సినిమా >>

సుమంత్‌ ఈజ్‌ బ్యాక్‌

sumanth is back

చాలా గ్యాప్‌ తీసుకుని 'నరుడా డోనరుడా' అంటూ కొత్త కాన్సెప్ట్‌తో ఇటీవలే మన ముందుకు వచ్పాడు అక్కినేని మేనల్లుడు సుమంత్‌. అయితే ఈ సినిమా కాస్త నిరాశపర్చడంతో మళ్లీ కొంచెం గ్యాప్‌ తీసుకున్నాడు హీరో సుమంత్‌. ఇప్పుడు మరో కొత్త సినిమాతో వస్తున్నాడు. తాజాగా తన కొత్త సినిమాని పట్టాలెక్కించాడు. ఈ సినిమా ప్రారంభోత్సవం నిరాడంబరంగా జరిగింది. త్వరలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనుంది. కొత్త దర్శకుడు గౌతం తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఓ కొత్త హీరోయిన్‌, సుమంత్‌ సరసన నటించనున్నట్లు తెలియవస్తోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అట.

అది కూడా కొత్తదనంతో కూడిన ఎంటర్‌టైనర్‌ అని చిత్ర యూనిట్‌ అంటోంది. సరికొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. హీరోగా ఫెయిలవుతోన్న సుమంత్‌ ఇకపై నటించడనీ, తనకి ప్రొడక్షన్‌ ఫీల్డ్‌ అంటే ఇంట్రెస్ట్‌ అనీ ప్రచారం జరిగింది. సో ఆ రకంగా యాక్టింగ్‌కి గుడ్‌ బై చెప్పేసి ఇకపై తన సొంత బ్యానర్‌లో సినిమాలు చేసుకుంటూ నిర్మాతగా సెటిలైపోతాడనీ అనుకున్నారంతా. కానీ మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలనుకుంటున్నాడు  సుమంత్‌. సుమంత్‌ మంచి నటుడే. కానీ అదృష్టమే వరించడం లేదు. ఈ సినిమాతో సుమంత్‌కి విజయం చేకూరి,  మరిన్ని మంచి చిత్రాల్లో నటించాలనీ మనం కూడా ఆశిద్దాం.

మరిన్ని సినిమా కబుర్లు
M.L.A performence in item song