అవసరాల కామెడీ టైమింగ్ గురించి అందరికీ తెలిసిందే. అలాగే ఆయన డైరెక్షన్ స్టైల్ కూడా బాగా తెలుసు. అయితే తాజాగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో అవసరాల మన ముందుకు వస్తున్నాడు. అదే 'బాబు బాగా బిజీ' సినిమా. నవీన్ మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అవసరాలతో పాటు ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. 'గుండె జారి గల్లంతయ్యిందే' సినిమాలో క్యూట్‌గా కనిపించిన మిస్తీ చక్రవర్తి, చలాకీ పిల్ల తేజస్విని, బుల్లితెర రాములమ్మ శ్రీముఖి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే, ఈ సినిమాలో అవసరాల పాత్రే చాలా భిన్నంగా ఉండబోతోంది.
అమ్మాయిల పిచ్చోడి పాత్రలో కనిపిస్తున్నాడు అవసరాల ఈ సినిమాలో. అమ్మాయిల్ని ముగ్గులోకి దించడంలో అవసరాల తరువాతే ఎవరైనా అట. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ సంగతండీ బాబూ ఇది. అందుకే ఈ బాబు అంత బిజీ అన్న మాట. ఏ అమ్మాయి కనిపించినా వదిలిపెట్టడంట. తన మాటల్తో బురిడీ కొట్టించి ప్రేమలోకి దించాల్సిందేనట. అదీ అవసరాల క్యారెక్టర్ ఈ సినిమాలో. తాజాగా వచ్చిన ఈ సినిమా టీజర్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తోంది. బాలీవుడ్ 'హంటర్' సినిమాకి తెలుగు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మరి అవసరాలలోని ఈ డిఫరెంట్ యాంగిల్‌ని ప్రేక్షకులు ఎలా స్వాగతించి ఆదరిస్తారో చూడాలిక. ఏప్రిల్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
|