'యూ ఆర్ మై ఎమ్‌ఎల్‌ఎ' అని అల్లు అర్జున్, 'సరైనోడు' సినిమాలో కేథరీన్ కోసం సాంగేసుకున్నాడు. అంతకు ముందు వీరిద్దరూ 'టాపు లేచిపోద్ది' అనే సాంగ్‌తో 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో డాన్స్ దుమ్ము రేపేశారు. అలా ఈ ముద్దుగుమ్మ చేసిన స్పెషల్ సాంగ్స్ అన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. అయితే ఈ సినిమాల్లో అమ్మడు కేవలం స్పెషల్ సాంగ్స్ కోసమే కాకుండా, సినిమాలో కీలకపాత్రను కూడా పోషించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఐటమ్ సాంగ్‌కి 'సై' అనేసింది. దర్శకుడు బోయపాటి శ్రీను అడగ్గానే, ఐటమ్ సాంగ్ చేయడానికి కేథరీన్ ఒప్పేసుకుంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన తొలి సినిమా 'అల్లుడు శ్రీను'లో తమన్నా ఐటమ్ సాంగ్ చేసింది. అతనితో తమన్నా రెండు ఐటమ్ సాంగ్స్ బ్యాక్ టు బ్యాక్ చేసేసింది. ఇప్పుడు ఆ ఛాన్స్ కేథరీన్‌కి దక్కినట్టుంది. ఈ మధ్యే ఈ ముద్దుగుమ్మకి మెగాస్టార్‌తో ఐటెం సాంగ్ చేసే అదృష్టం దక్కినట్లే దక్కి చేజారిపోయింది. మరి ఈ సినిమాతో ఐటెం గాళ్‌గా మారనున్న ఈ ముద్దుగుమ్మ ఈ ఒక్కదాంతో సరిపెడుతుందా? లేక తమన్నా తరహాలో రెండు చేస్తుందా? చూడాలిక. అలాగే ఈ సినిమాలో ఆమె స్పెషల్ సాంగ్ చేసినందుకు భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా అందుకోనుందట. మరి కేథరీన్ ఏమీ తక్కువేం కాదు. 'సరైనోడు' సినిమా ఆమెకు మంచి విజయాన్ని తెచ్చిపెట్టడమే కాదు. ఆ పాత్ర కూడా ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అలా ఈ ముద్దుగుమ్మకి డిమాండ్ బాగానే ఉంది మరి.
|