మెగాస్టార్ ప్రధాన పాత్రలో ప్రముఖ చారిత్రక చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అదే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' మరుగున పడిపోయిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత గాధే ఈ సినిమా. ఈ సినిమా కోసం చిరంజీవి కంప్లీట్ మేకోవర్ అవుతున్నారు. అందులో భాగంగా చిరు చాలా స్లిమ్ అయ్యారనీ సమాచారమ్. ఇప్పటికే గెడ్డం పెంచి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు చిరంజీవి. ఈ సినిమా కోసం ప్రత్యేక టీమ్ స్క్రిప్ట్ వర్క్ చేస్తోంది. దాదాపుగా స్క్రిప్ట్ రెడీ అయిపోయింది.
ఇక పట్టాలెక్కడమే తరువాయి. ఈ సినిమాని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'కి నిర్మాతగా వ్యవహరించిన రామ్ చరణే ఈ సినిమాని కూడా రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌లో తెరకెక్కుతోన్న రెండో చిత్రమిది. ఈ సినిమా కోసం పరుచూరి బ్రదర్స్ అదిరిపోయే కథని సిద్ధం చేశారు. చిరంజీవి ఎప్పట్నించో ఈ సబ్జెక్ట్‌లో నటించాలని అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఇది సాధ్యపడింది. హై అండ్ టెక్నాలజీ వేల్యూస్‌తో ఈ సినిమాని రూపొందించాలని అనుకుంటున్నారట. మరో ముఖ్య విషయం ఏంటంటే భళ్లాలదేవ రానా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. నెగిటివ్ రోల్‌లో రానా నటించబోతున్నాడనీ అంటున్నారు. అయితే ఇంకా ఈ విషయంలో క్లారిటీ రాలేదు. ఆగష్టులో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
|