బాలకృష్ణ - పూరీ కాంబినేషన్‌లో సినిమా సెట్స్‌పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. సినిమా అనౌన్స్ రోజునే రిలీజ్ డేట్‌ని కూడా అనౌన్స్ చేసేశారు పూరీ జగన్నాధ్. ఈ సినిమాలో బాలయ్య కొత్త గెటప్‌లో కొత్త లుక్‌తో కనిపించబోతున్నారట. ముగ్గురు ముద్దుగుమ్మలు బాలకృష్ణకి జోడీగా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, బాలయ్య నెక్స్ట్ మూవీని కూడా లైన్‌లో పెట్టేశారు. లైన్‌లో పెట్టడమే కాకుండా, ఈ సినిమాని వచ్చే నెల్లోనే సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారట.
జూన్ 10 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుందని చిత్ర యూనిట్ తెలిపింది. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాకి సి. కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సీనియర్ హీరోలతో పలు చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ డైరెక్టర్ కె.ఎస్. రవికుమార్. బాలయ్యతో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికి కుదిరింది. ఈ కాంబినేషన్‌లో సినిమా అంటే భారీగా అంచనాలున్నాయి. బాలయ్య 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా తర్వాత చాలా స్పీడు మీదున్నారు. అస్సలు గ్యాప్ తీసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూనే మరో పక్క రాజకీయాల్లో కూడా యాక్టివ్‌గా పని చేస్తున్నారు. సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు నిర్మాత సి. కళ్యాణ్.
|