అల్లు అరవింద్ ఓ మహాద్భుత ప్రయత్నానికి పచ్చ జెండా ఊపారు. అద్భుత చారిత్రక గాధ అయిన రామాయణాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలియ వస్తోంది. అల్లు అరవింద్‌తో పాటు ఈ భారీ బడ్జెట్ మూవీకి పలువురు ప్రముఖ ప్రొడ్యూసర్స్ కూడా పెట్టుబడి పెట్టబోతున్నారనీ సమాచారమ్. మానవీయ విలువల్ని చాటి చెప్పిన గాధ 'రామాయణం'. అటువంటి అద్భుత ఘట్టాన్ని తెరపై ఆవిష్కరించడం అంటే ఆషా మాషీ కాదు. దానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది.
చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. రామాయణంలోని ప్రతీ పాత్ర బలమైన పాత్రే. రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు, రావణుడు ఇలా ఒక్కటేమిటి వందల పాత్రలు ఉన్నాయి రామాయణంలో. ప్రతీ పాత్రకీ ఓ ప్రత్యేక విశిష్టత ఉంది. ప్రతీ పాత్ర మన జీవన విధానాన్ని పెంపొందించే పాత్ర. అటువంటి ఈ పాత్రలన్నింటినీ తెరపై మేనేజ్ చేయడం చాలా కష్టమైన పనే. ఈ భూమ్మీద మానవుడు ఎలా జీవించాలనేది తెలియ చెప్పే ఈ రామాయణ గాధని తెరకెక్కించాలని చాలా మంది చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ ప్రయత్నం ఇన్నాళ్లకి కార్యరూపం దాల్చనుంది. 500 కోట్ల బడ్జెట్‌తో అత్యంత భారీ సాంకేతిక వర్గంతో ఈ సినిమాని అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కించబోతున్నారట. ఈ ప్రయత్నానికి కేవలం తెలుగు నటీనటులే కాక, జాతీయ స్థాయిలో అన్ని భాషల నుండీ వివిధ నటీనటుల్ని ఎంచుకుంటున్నారనీ తెలియ వస్తోంది. అయితే ఇంత భారీ ప్రాజెక్టుకి దర్శకత్వం వహించే ఆ గొప్ప డైరెక్టర్ ఎవరనేది ఇంకా తేలాల్సి వుంది.
|