తెలుగు చిత్ర సీమలోనే అత్యంత గొప్ప చిత్రంగా కీర్తి పొందుతోంది 'బాహుబలి' సినిమా. తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచం నలుమూలలా చాటి చెప్పి తొలి భారతీయ చిత్రంగా ఈ చిత్రం ఖ్యాతికెక్కింది. సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రం కూడా ఇదే. రెండో స్థానాన్ని అమీర్ ఖాన్ నటించిన 'దంగల్' దక్కించుకుంది. రాజమౌళి అద్భుత వెండితెర సృష్టి 'బాహుబలి' చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు దక్కించుకుంటోంది. విడుదలైన నాటి నుండీ వసూళ్లు వరద అలాగే కొనసాగుతోంది. రెండో వారంలో కూడా కనీ వినీ ఎరుగని రీతిలో వసూళ్లుండడం చెప్పుకోదగ్గ విషయం. దాదాపుగా 1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది .
ఈ సినిమా. ఇంకా రన్ అవుతూనే ఉంది. చిన్న సినిమా, పెద్ద సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడం ఈ సినిమా ఇంత స్థాయిలో వసూళ్లు సాధించడానికి మరో కారణం అని కూడా చెప్పుకోవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ పరంగా హాలీవుడ్ స్థాయిలో ఉందని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. కేవలం తెలుగు చిత్రంలా కాకుండా దీన్ని ఓ జాతీయ చిత్రంగా పరిగణిస్తుండడం చాలా గొప్ప విశేషం. ఈ సినిమాలోని ప్రతీ పాత్ర అందరికీ గుర్తుండిపోయే పాత్రే కావడం మరో విశేషం. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కి, అత్యధిక ధియేటర్లో విడుదలవడమే కాకుండా, ఎక్కడికి వెళ్లినా అంతా 'బాహుబలి' సినిమా గురించి మాట్లాడుకోవడం తెలుగు సినీ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం. ఇది 'బాహుబలి' సాధించిన విజయం కాదు, యావత్ తెలుగు సినిమా సాధించిన అపూర్వ విజయం.
|