'దువ్వాడ జగన్నాధమ్ - డీజె' రిలీజ్‌కి ముస్తాబవుతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో 'ముకుందా' ఫేం పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా అసలే స్టైలిష్ స్టార్. అందులోనూ హరీష్ శంకర్ డైరెక్షన్. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్. అన్నీ వెరసి ఈ సినిమా చాలా స్టైలిష్‌గా రూపొందుతోంది. హరీష్ శంకర్ ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టి చిత్రీకరిస్తోన్న సినిమా ఇది. అసలే అల్లు అర్జున్‌కి వరుస విజయాలతో తిరుగు లేకుండా సక్సెస్ జోరు కొనసాగిస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఇంతవరకూ ఎప్పుడూ నటించని పాత్రలో నటిస్తున్నాడు.
బ్రాహ్మణ యువకుడి పాత్రలో చేతితో గరిటె తిప్పుతూ, నోటితో మంత్రాలు వల్లె వేస్తూ అల్లు అర్జున్ చేసేే సందడి అంతా ఇంతా కాదు ఈ సినిమాలో. మరో పక్క క్లాస్ లుక్‌లో కనిపించే మాస్ టచ్చింగ్ పాత్రలోనూ అల్లు అర్జున్ కనిపిస్తున్నాడు. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాలో ఉండబోతున్నాయట. ప్రేక్షకులు మెచ్చే మరిన్ని ప్రత్యేకతలు ఈ సినిమాలో ఉన్నాయని చిత్ర యూనిట్ తెలుపుతోంది. జూన్ 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పబ్లిసిటీ పనులు వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇప్పటికే టీజర్ సంచలనాలు సృష్టిస్తూనే ఉంది. ఇక సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సృష్టించే సంచలనాలకై అంతా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.
|