Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
radha movie review

ఈ సంచికలో >> సినిమా >>

రిచా పనాయ్ తో ముఖాముఖీ

interview with richa panay

చందమామ లాంటి అందం తో చందమామ కధలు సినిమా లో మెరిసిన అందాల నటి ,మలయాళం సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం ఐ తెలుగు లో అల్లరినరేష్ సరసన యముడికి మొగుడు ,సునీల్ కాంబినేషన్ లో  వీడు గోల్డ్ ఎహె ,  రక్షకభటుడు , సినిమాలతో ప్రేక్షకులకి దగ్గరైన నటి రిచా పనై .. ఈ యంగ్ అండ్ టేలెంటెడ్ హీరోయిన్ రీచాపనయ్ మనతో ముచ్చటించిన ముచ్చట్లు ...

గోతెలుగు :  లక్నో నుండి ఇండస్ట్రీ వరకు మీ  జర్నీ గురించి  చెప్పండి.?? 
రిచా :  బాల్యము నుండి మిస్ ఇండియా గానీ, నటిగా గాని ఉండాలని నేను కోరుకున్నాను. నేను ఒక సాంప్రదాయిక కుటుంబానికి చెందిన అమ్మాయిని స్వతంత్రంగా ఉండటానికి నేను కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో  ఫ్లైట్ అటెండెంట్గా పనిచేసాను అప్పుడే బొంబాయి వచ్చాను , అక్కడే నా కెరీర్ ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాను .  పరిశ్రమలో ప్రవేశించటానికి నా తల్లిదండ్రులను ఒప్పించేందుకు కొంత సమయం పట్టింది.

గోతెలుగు :  మీరు చిత్రాలకు ప్రవేశించడానికి ముందు మీరు ఒక కింగ్ఫిషర్ మోడల్. మోడల్ గా లేదా నటిగా కెరీర్ ప్రారంభించటానికి మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏంటి?
రిచా :  నేను ఒక ఫ్లైట్ అటెండెంట్ ని, కింగ్ఫిషర్ మోడల్ కాదు. నేను స్వతంత్రంగా ఉండాలని కోరుకున్నాను  , చిత్ర పరిశ్రమలో ఎలా ప్రవేశించాలో నేను అర్థం చేసుకున్నాను. నేను చిన్నప్పుడు బాలీవుడ్ నటులని చూసి ఆకర్షితురాలిని అయ్యాను. నేను వారిలో ఒకరిగా అవ్వాలని కోరుకున్నాను.  అలా నాకు సినీ పరిశ్రమ మీద ఇంటరెస్ట్ ఏర్పడింది .

గోతెలుగు : ) మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది?

రిచా :  నేను కింగ్ఫిషెర్  ఎయిర్ లైన్స్తో ప్రయాణిస్తున్నప్పుడు నా ప్రొఫైల్ పూర్తిచేసుకుని ఇండస్ట్రీ కి సంబంధించిన  వారికి పంపించాను . వెంటనే భీమ గోల్డ్ కి మలయాళంలో ఒక పెద్ద టివిసి వచ్చింది. అప్పటి నుండి నాకు  సినిమా ఆఫర్స్ వచ్చాయి .

గోతెలుగు :  టీం వర్క్ అనేది ఈ సినీ ఫీల్డ్ లో చాల ముఖ్యం ..మీరేమంటారు ?

రిచా : అవును టీమ్ వర్క్   చాలా ముఖ్యమైనది.వంటరిగా  ఏమి చెయ్యలేం సో టైం అండ్ ఎక్స్పీరియన్స్ అన్ని నేర్పిస్తుంది .నా స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను .

గోతెలుగు :  ఒక సినిమాని ఒక చెయ్యాలి అంటే మీరు చూసే ఎలెమెంట్స్ ఏంటి ?   హీరో లేదా బ్యానర్ లేదా దర్శకుడు?

రిచా :  ఇవి అన్ని ముఖ్యమైనవి  , నాకున్న ఛాయస్ లని బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటా . ఖాళీగా కూర్చొని పెద్ద హీరోలు లేదా పెద్ద దర్శకుల కోసం ఎదురు చుసేకన్నాచేతిలో ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిదని నమ్ముతాను.

గోతెలుగు : యాక్టింగ్ లో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ..?   
రిచా : సీనియర్ నటుల సెక్సెస్ స్టోరీస్ నాకు ఇన్స్పిరేషన్ .నన్ను నేను పూర్తిగా నమ్ముకుంటే .కష్టపడితే సాధించలేనిది ఏది  ఉండదు . హార్డ్ వర్క్ ఈజ్ సీక్రెట్ అఫ్ సెక్సెస్ .నా ఫామిలీ అండ్ నా ఫ్రెండ్స్ నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు .

గోతెలుగు : ఇప్పటివరకు గడిచిన  మీ కెరీర్ గురించి ??
రిచా :  నేను ఇంకా నేర్చుకునే స్థితిలోనే ఉన్నాను .చాల సాధించాలి .యాక్టింగ్ ఫీల్డ్ లోనే కాదు ప్రతి రంగం లో మనిషి నిత్య విద్యార్థి .ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి .  

గోతెలుగు : మీ కెరీర్ ప్రారంభం నుండి మీరు గర్వంగా ఫీల్ అయిన సందర్భం ??
రిచా :  అవార్డులు వచ్చినప్పుడు సంతోషంగా ఉన్నాను  , ఎవరైనా నా పనిని ప్రసంశించినప్పుడు చాల హ్యాపీగా ఫీల్ అంత ..బట్ అది గర్వం కాదు ..

గోతెలుగు : సినిమా అండ్ మోడలింగ్ లో ఉన్నారుకదా ఈ రంగం లో మీరు ఎప్పుడైనా మీకు మైనస్ పాయింట్స్ ఉన్నాయని అనుకున్నారా ? అనుకుంటే మీ మైనస్ పాయింట్స్ ఏంటి అని అనుకుంటున్నారు    ?   
రిచా : నేను అంత సోషల్ పర్సన్ ని కాను .నాకు లేట్ నైట్ పార్టీలు నచ్చవు .క్లబ్ అండ్ పబ్ కల్చర్ కి దూరం గా ఉంటాను . ఇలాంటి విషయాల్లో నేను సైలెంట్ గా ఉండటం నా మైనస్ ఏమో అని ఒక్కో సారి అనుకుంటాను .
గోతెలుగు : మీ సీనియర్ నటుల నుండి మీరు ఏమి నేర్చుకున్నారు?
రిచా : చాలా .. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వారు కష్టపడడాన్ని ఇష్టం గా భావిస్తారు.

గోతెలుగు :మీరు ఏ విధమైన పాత్రలు చేయడానికి ఇష్టపడతారు?అంటే మీకంటూ పలానా పాత్ర చెయ్యాలి అని ఏమైనా ఉందా ??
రిచా : నేను రెడీ గా ఉన్నాను .

గోతెలుగు :  అభిమాన నటుడు మరియు నటి ఎవరు?
రిచా :  లిస్ట్ చాల పెద్దగా ఉంటుంది  షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, రన్బీర్, రణ్వీర్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, అనుష్క శెట్టి, అనుష్క శర్మ, త్రిష, ఇలియానా, దీపిక, ఐశ్వర్య, అలియా...ఇలా 

గోతెలుగు :  అప్ కమింగ్ యాక్టర్స్ కి మీరు ఏమైనా సజెషన్స్ ఇస్తారా ??
రిచా :  సజెషన్స్ అంటే ఏమి ఇవ్వలేను ..ఎందుకంటే నేను ఇంకా నేర్చుకుంటున్నాను కాబట్టి .బట్ టాలెంట్ ని నమ్ముకోండి , స్కిల్స్ ని డెవలప్ చేసుకోండి హార్డ్ వర్క్ ని ఎప్పుడు వదలొద్దు .మిగిలినది దేవునికే వదిలేయండి.

గోతెలుగు :  మీ దృష్టిలో మాలీవుడ్, టాలీవుడ్  మరియు బాలీవుడ్ల మధ్య ఏవైనా వ్యత్యాసాలు ఉన్నాయా?
రిచా : బడ్జెట్ విషయం లో తప్ప వేరే ఏమిలేవు ..చాల మంచి వాళ్ళండి అందరూ .

 

గోతెలుగు : మీ గురించి ఎవరికీ తెలియని మూడు విషయాలు

రిచా : - నేను స్కూల్ లో బెస్ట్ NCC  క్యాడెట్ నాకు రెండు స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి 

- నేను ఎగ్జామ్స్ ఉన్నపుడు మాత్రమే చదివేదాన్ని ..నార్మల్ టైం లో స్టడీస్  ఇంట్రస్ట్ ఉండేది కాదు .
- 8th  వరకు బాగా అల్లరి చేశా ..తరువాత కామ్ అయిపోయా .

గోతెలుగు :  దేవుడు మీకు కనిపించినట్లయితే   ఏమి అడుగుతారు ? 
 అందరూ బాగుండాలి ..అందులో నేనుండాలి ..అంతే ..
గోతెలుగు :. మీకు అవకాశం వస్తే మీరు ఎవరితో గడపడానికి ఇష్టపడతారు?
రిచా :  రణబీర్ కపుర్ మరియు ప్రభాస్, ఇద్దరు సింగిల్ గా  ఉన్నారని భావిస్తున్నాను.. హా హా హా

గోతెలుగు :  మీతో ఎల్లపుడు ఉంచుకునే వస్తువులు?
రిచా :  హ్యాండ్ సానిటైజర్, హ్యాండ్ క్రీమ్, పెర్ఫ్యూమ్, లిప్ బామ్, టిష్యూస్, మొబైల్, నగదు మరియు కార్డులు


గోతెలుగు : థాంక్యూ ఫర్ యువర్ టైం రిచా పనై .

రిచా :  మై ప్లెజర్ ..రక్షక భటుడు సినిమా తో మీ ముందుకి రాబోతున్నాను ,చాల భిన్నమైన స్టోరీ రక్షకభటుడు సినిమా  మీరు తప్పక చుడండి ,ఆశీర్వదిచండి .

-గంగాధర్

మరిన్ని సినిమా కబుర్లు
uyyalavada shooting start