గత కొంత కాలంగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న మెగా గేమ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ముగియనుంది. మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో బుల్లితెరపై మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. సామాన్యులతో పాటు, సెలబ్రిటీస్, చిన్న పిల్లలు ఇలా పలువురు ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేశారు. స్టార్‌డమ్‌ని పక్కన పెట్టి చిరంజీవి ఈ షోకి పూర్తిగా న్యాయం చేశారు. ఫుల్ జోష్‌తో ఈ షోని నిర్వహించారు. చిరంజీవి ఎనర్జిటిక్ పర్‌ఫామెన్స్‌తో ఈ ప్రోగ్రాంకి వచ్చిన సెలబ్రిటీస్‌కి, న్యూ బూస్టప్ ఇచ్చారు. సెలబ్రిటీస్‌కి చిరంజీవితో ఉన్న అనుబంధానికి సంబంధించిన వివరాలు ప్రేక్షకులకి మరింత క్యూరియాసిటీని పెంచాయి. అలా ఈ షో చాలా సరదా సరదాగా సాగింది. ఇక చిన్న పిల్లల స్పెషల్ అయితే మరీ జోష్‌గా నడిచింది. చిన్న పిల్లల్లో చిన్న పిల్లాడిలా చిరంజీవి తనని తాను మార్చేసుకున్నారు.
దాంతో పిల్లలు ఏమాత్రం భయం బెరుకు లేకుండా చాలా కంఫర్ట్‌బుల్‌గా ఫీలయ్యి ఈ షోలో చిరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం విశేషం. టోటల్‌గా ఈ గేమ్ షో బుల్లితెరకు ఓ కొత్త అనుభవాన్ని తెచ్చి పెట్టింది. మెగాస్టార్ అప్పియరెన్స్‌తో న్యూ గ్లామర్ అద్దింది. ఈ షో కంప్లీట్ అయ్యాక, చిరంజీవి తన నెక్స్ట్ సినిమా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' పై కాన్‌సన్‌ట్రేషన్ చేయనున్నారట. ఇందుకోసం ఫిజిక్ విషయంలో మేకోవర్ కావాలనుకుంటున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్ర కోసం గెడ్డం పెంచి కొత్త లుక్‌లోకి మారిపోయారు చిరు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆగష్టులో సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.
|