సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'కాలా' అలియాస్ కరికాలన్. ఈ టైటిల్ లోగో పోస్టర్ తాజాగా విడుదలయ్యింది. ధనుష్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది. ఉండర్ బార్ ఫిల్మ్స్ పతాకంపై ధనుష్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాని రూపొదిస్తున్నారు. 'కబాలి' డైరెక్టర్ పా రంజిత్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కబాలి ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేకపోయినా, వసూళ్లు మాత్రం బాగానే సాధించింది. ఈ సినిమాకి మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా అమలు అయ్యింది. ఈ సారి అలా కాదు రజనీ నుండి ఓ సూపర్ హిట్ వస్తుందని డైరెక్టర్ పా రంజిత్ నమ్మకంగా చెబుతున్నారు.
ఇప్పుడున్న మార్కెట్ వ్యూహాలకు తగ్గట్టుగా ఈ సినిమాని ప్రమోట్ చేయాలనుకుంటున్నారట. జాతీయ స్థాయిలో ఈ సినిమా ప్రమోషన్స్ ఉండబోతున్నాయట. ఇంచుమించుగా అన్ని భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషుతో పాటు ఇతర భాషల్లో కూడా రజనీకాంత్‌కి పాపులారిటీ ఉంది. ఆ ఉద్దేశ్యంతోనే ఈ సినిమాని ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ విడుదల చేయానుకుంటున్నారట. ప్రస్తుతం ఈ సినిమా టైటిల్‌ని తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో విడుదల చేశారు. కరికాలన్ అంటే యోధుడు, ఏదైనా చేయగల సమర్ధుడు అనే అర్ధం వస్తుంది. మరో పక్క రజనీ రాజకీయ రంగ ప్రవేశం గురించి కూడా విస్థృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాపై పొలికల్ ఆశక్తి కూడా నెలకొంది.
|