మెగా పవర్ స్టార్ హీరోగా తెరకెక్కుతోన్న సరికొత్త చిత్రం 'రంగస్థలమ్ 1985'. ఈ సినిమా చరణ్‌కి చాలా ప్రత్యేకం. ఇదో ప్రయోగాత్మక చిత్రం. అందుకే ఇప్పుడు ఎవరి నోట విన్నా ఈ సినిమా గురించిన చర్చే వినిపిస్తోంది. మరో పక్క ఈ సినిమాకి శాటిలైట్ బిజినెస్ కూడా ఓ రేంజ్‌లో జరుగుతోంది. సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఓ అందమైన ప్రేమ కావ్యం ఈ చిత్రం. ఈ లవ్ స్టోరీ ఇప్పటిది కాదు, 1985 నాటి లవ్‌స్టోరీ. అందుకే ఇందులో చాలా ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిలా నటిస్తున్నాడు .
ఈ చిత్రంలో. ఇప్పటికే ఈ సినిమాలోని చరణ్ లుక్స్ బయటికి వచ్చేశాయి. ఆ లుక్‌లో మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాడు చరణ్. లుంగీతో, బారు గెడ్డంతో మాస్‌ని యమ క్లాస్‌గా ఎట్రాక్ట్ చేసేస్తున్నాడు. అలాగే సుకుమార్‌ని తక్కువగా అంచనా వేయలేము. తన సినిమాల్లోని లవ్‌స్టోరీస్‌తో ప్రేేక్షకుల్ని ఏదో మాయ చేసేస్తుంటాడు. అలాంటి మాయేదో సుకుమార్ ఇప్పుడు ఈ సినిమాతోనూ చేయనున్నాడనిపిస్తోంది. కోనసీమ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. లొకేషన్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఈ సినిమాలో. అందుకే గోదావరి జిల్లాల్లోని అదిరిపోయే లొకేషన్స్‌ని ఈ సినిమా కోసం ఎంచుకున్నారు 'రంగస్థలమ్' చిత్ర యూనిట్. ఈ సినిమాలో ముద్దుగుమ్మ సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.
|