పవన్ కళ్యాణ్ ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ ఫిట్‌గానే ఉంటారు. కానీ ఈ మధ్య ఇటు సినిమాల్లోనూ, అటు రాజకీయాల్లోనూ ఒకేసారి బిజీ అయిపోవడం వల్ల ఫిట్‌నెస్‌ని కొంచెం పక్కన పెట్టాల్సి వచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ కాస్త బొద్దుగా తయారయ్యారు. అయితే తాజాగా పవన్ చాలా స్లిమ్‌గా కనిపిస్తున్న ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ బాగా స్లిమ్ అయ్యారని తెలియ వస్తోంది. ఈ సినిమా సెట్స్‌లో పవన్ కళ్యాణ్ అందంగా కనిపించడమే కాదు, చాలా హుషారుగా కూడా కనిపిస్తున్నారు. అభిమానులకు ఆప్యాయంగా అభివాదాలు చేస్తున్నారు.
షూటింగ్ స్పాట్‌లో తన వద్దకు వచ్చిన ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటిస్తున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఇలా ఉండేవారు కాదు. ఇప్పుడు రెగ్యులర్‌గా ఫ్యాన్స్‌ని కలుస్తున్నారు. గతంలో 'కాటమరాయుడు' సెట్‌లో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. అలాగే ఇప్పుడు కూడా. ఇంకేముంది పవర్ స్టార్ ఫ్యాన్స్‌కి ఇంతకన్నా కావాల్సిందేముంటుంది. పవన్ కళ్యాణ్ అలా ఒక్క చూపు చూస్తే చాలు ఫ్యాన్స్ పండగ చేసేస్కుంటారు. అలాంటిది ఇంత క్లోజ్‌గా తమ అభిమాన హీరో మెలగుతూంటే అభిమానుల ఆనందం అంబరాన్నంటేస్తోంది మరి.
|