Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
gopichand special

ఈ సంచికలో >> సినిమా >>

బాలకృష్ణ కోసం దిగి వచ్చిన నయన్‌

nayan with balakrishna

బాలకృష్ణ వందో చిత్రం నుండీ మాంచి హుషారు మీదున్నారు. జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అస్సలు గ్యాప్‌ తీసుకోకుండానే వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్నారు. వందో చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా సెట్స్‌పై ఉండగానే 101వ చిత్రానికి రెడీ అయిపోయారు. ఆ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే ఎక్కువ గ్యాప్‌ తీసుకోకుండానే పూరీతో సినిమాని పట్టాలెక్కించారు. క్రేజీ కాంబినేషన్‌లో బాలయ్య సినిమాని ఓకే చేసి హాట్‌ న్యూస్‌ క్రియేట్‌ చేశారు. ఈ సినిమాకి 'పైసా వసూల్‌' అనే సూపర్బ్‌ టైటిల్‌ని పెట్టి, మరో సెన్సేషన్‌ అయ్యారు. ఈ సినిమా ప్రస్తుతం జోరుగా షూటింగ్‌ జరుపుకుంటోంది. సెప్టెంబరులో దసరా కానుకగా విడుదల కానుంది. కాగా బాలయ్య ఇప్పుడు మరో సినిమాకి పచ్చ జెండా ఊపేశారు. ఈ సినిమా కె.ఎస్‌. రవికుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఈ సినిమాలో బాలయ్యతో జత కడుతోన్న బ్యూటీ ఎవరో తెలుసా? నయనతార. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కోలీవుడ్‌లో ఫుల్‌ బిజీ. అయితే టాలీవుడ్‌పై అమ్మడికి అంతగా ఇంట్రెస్ట్‌ లేదు. అందుకే ఇక్కడ సినిమాలు ఒప్పుకోవడం లేదు. అంతేకాదు నయన్‌తో సినిమా అంటే మన దర్శక నిర్మాతలు ఆమడ దూరం పరుగెత్తేస్తున్నారు కూడా. అలాంటిది బాలయ్య సినిమాలో నయనతార అనగానే, తెలుగు ప్రేక్షకులు ఉలిక్కి పడ్డారు. అయితే గతంలో బాలయ్య - నయన్‌ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ సూపర్‌ సక్సెస్‌ అందుకున్నాయి. అందుకే బాలయ్య స్వయంగా ఆయనే ఈ సినిమా కోసం నయనతారని సూచించినట్లు తెలుస్తోంది. బాలయ్య అడిగితే నయన కాదనలేకపోయిందట. మొత్తానికి బాలయ్య కోసం నయన్‌ టాలీవుడ్‌ వైపు చూడాల్సి వచ్చింది. 

 

మరిన్ని సినిమా కబుర్లు
pavan kalyan so busy