అతిలోక సుందరి శ్రీదేవి అంటే అందరికీ హాట్ ఫేవరేట్ హీరోయినే. ఐదు పదుల వయసులోనూ ఆమె ఏమాత్రం వన్నె తగ్గని అందంతో మెరిసిపోతోంది. ప్రస్తుతం 'మామ్' సినిమాలో నటిస్తోంది. 'ఇంగ్లీష్, వింగ్లీష్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన శ్రీదేవి తాజా మూవీ 'మామ్' విషయంలో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాకి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. ప్రమోషన్స్‌లో శ్రీదేవి జోరు, ఉత్సాహం చూస్తుంటే ఆమె అభిమానుల ఆనందానికి అంతే ఉండడం లేదు.
ఇకపై రెగ్యులర్‌గా సినిమాల్లో నటిస్తానని అభిమానులకు హామీ ఇచ్చింది శ్రీదేవి. హిందీలో తెరకెక్కుతోన్న 'మామ్' సినిమా తెలుగుతో పాటు, ఇతర భాషల్లో కూడా విడుదల అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీదేవి పలు ప్రాంతాల్లో తిరుగుతూ, అభిమానులకు దగ్గరగా మూవ్ అవుతోంది. ఇంత వయసులోనూ ఆమె ఇంత ఫిట్‌గా, గ్లామరస్‌గా మెరిసిపోవడానికి కారణం యోగానే అంటోంది అతిలోక సుందరి. కూతుళ్ల సినీ రంగ ప్రవేశం గురించి మాత్రం మాట్లాడడం లేదు శ్రీదేవి. శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి కోసం అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ కూడా యంగ్ హీరోలు వెయిట్ చేస్తున్నారు. కానీ ఆమె ఎంట్రీకి ఇంకా టైం ఉందంటోంది శ్రీదేవి. జూలైలో 'మామ్' సినిమాతో శ్రీదేవి ప్రేక్షకుల ముందుకు రానుంది.
|