Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
rangasthalam what a hipe

ఈ సంచికలో >> సినిమా >>

'గౌతమ్‌ నందా' గోపీచంద్‌కి అందుకే స్పెషల్‌

gopichand special

సంపత్‌ నంది డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'గౌతమ్‌ నందా'. ఆరడుగుల అందగాడు గోపీచంద్‌ హీరోగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. స్టైలిష్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా సంపత్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. పోజిటిక్‌ టాక్‌ని సొంతం చేసుకుంటోంది. ఈ సినిమాలో గోపీచంద్‌ రెండు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపించనున్నాడని టీజర్‌ ద్వారా తెలిసింది. రెండు గెటప్స్‌లోనూ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు గోపీచంద్‌. హన్సిక, కేథరీన్‌లు ఈ సినిమాలో గోపీచంద్‌తో జత కడుతున్నారు.

ఈ సినిమాకి ప్రీ రిలీజ్‌ బిజెనెస్‌ చాలా బాగా జరిగిందంటున్నారు. దాదాపు నలభై కోట్ల దాకా బిజినెస్‌ జరిగిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గోపీచంద్‌ కెరీర్‌లో ఇదే బిగ్గెస్ట్‌ ఫిగర్‌ కానుంది. ఈ సినిమా ప్రోమోస్‌ కూడా జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. దాంతో సినిమాపై అంచనాలు భారీ ఎత్తున నెలకొన్నాయి. ఈ సినిమాతో గోపీచంద్‌ సూపర్‌ సక్సెస్‌ కొట్టడం ఖాయం అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కించడంలో సంపత్‌ నంది దిట్ట. ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ ఇంతకు ముందెన్నడూ చూడనంత కొత్తగా ఉంటాయట. అలాగే పక్కా మాస్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కూడా. మరో పక్క గోపీచంద్‌ నటించిన 'ఆరడుగుల బుల్లెట్‌', ఆక్సిజన్‌' సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. 'ఆరడుగుల బుల్లెట్‌' సినిమాలో నయనతార హీరోయిన్‌ కాగా, 'ఆక్సిజన్‌'లో రాశీఖన్నా, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

 

మరిన్ని సినిమా కబుర్లు
nayan with balakrishna