సంక్రాంతి బాలయ్యకి బాగా కలిసొచ్చిన పండగ. సంక్రాంతి నాడు విడుదలైన బాలయ్య సినిమాలు చాలా వరకూ సూపర్ హిట్స్ అయ్యాయి. అందుకే ఈ సారి సంక్రాంతికి బాలయ్య స్లాట్ బుక్ చేసేశారు. బాలయ్య కొత్త సినిమాని షురూ చేశారు. కె.ఎస్. రవికుమార్ డైరెక్షన్‌లో బాలయ్య కొత్త సినిమా ఇటీవలే ప్రారంభం అయ్యింది. సి. కళ్యాణ్ ఈ సినిమాకి నిర్మాత. ముద్దుగుమ్మ నయనతార ఈ సినిమాలో బాలయ్యతో జత కట్టబోతోందని ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే యోచనలో చిత్ర యూనిట్ ఉంది. ఇదిలా ఉండగా, బాలయ్య హీరోగా, పూరీ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న 'పైసా వసూల్' సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. అనుకున్న డేట్ కన్నా చాలా రోజుల ముందే ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 28న వస్తుందనుకున్న 'పైసా వసూల్' సెప్టెంబర్ 1కే విడుదలవుతుండడం అభిమానులు సంతోషించదగ్గ విషయం. బాలయ్య ఫ్యాన్స్‌కి ఎంతో స్పెషల్ సంక్రాంతి అంటే. 2017 సంక్రాంతికి 'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. వచ్చే ఏడాది అనగా 2018 సంక్రాంతికి కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య సినిమా రాబోతుందన్న మాట. అంటే బాలయ్య అభిమానులకి వచ్చే ఏడాది కూడా అసలు సిసలు సంక్రాంతి పండగే అన్నమాట.
|